Covid 19 Cases Update in India: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,61,386 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 5673 కేసులు తక్కువగా నమోదయ్యాయి. కరోనాతో మరో 1733 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,16,30,885కి చేరింది. ఇప్పటివరకూ 4,97,975 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 16,21,603 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 11.6 శాతంగా ఉన్న డైలీ పాజిటివిటీ రేటు గడిచిన 24 గంటల్లో 9.26 శాతంగా నమోదైంది. వీక్లీ పాజిటివిటీ రేటు 14.15 శాతంగా ఉంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కోవిడ్ రికవరీల సంఖ్య 2,81,109గా నమోదైంది. దీంతో ఇప్పటివరకూ నమోదైన మొత్తం రికవరీల సంఖ్య 3,95,11,307కి చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 94.91 శాతంగా ఉంది. నిన్న 11.6 శాతంగా ఉన్న డైలీ పాజిటివిటీ రేటు గడిచిన 24 గంటల్లో 9.26 శాతంగా నమోదైంది. వీక్లీ పాజిటివిటీ రేటు 14.15 శాతంగా ఉంది. 


కొత్తగా నమోదైన కేసుల్లో (Covid 19 Cases) అత్యధికంగా కేరళలో 51,887 కేసులు, తమిళనాడులో 16,096 కేసులు, మహారాష్ట్రలో 14,372 కేసులు, కర్ణాటకలో 14,336 కేసులు ఉన్నాయి. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో ఈ ఐదు రాష్ట్రాల్లోనే దాదాపు 65.1 శాతం కేసులు నమోదయ్యాయి.గడిచిన 24 గంటల్లో 57,42,659 కరోనా వ్యాక్సిన్ డోసులు (Covid Vaccination) వేయగా.. ఇప్పటివరకూ 1,67,29,42,707 వ్యాక్సిన్ డోసులు వేశారు. దేశంలో 18 ఏళ్లు పైబడిన దాదాపు 75 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తయింది. 


Also Read: Pushpa Stlye Smuggling: పుష్ప మూవీ స్టైల్లో ఎర్రచందనం అక్రమ రవాణా.. పోలీసులను బోల్తా కొట్టించేశాడు!


 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook