Delhi AIIMS doctors tested positive: న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనావైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలియజేసే ఘటన ఇది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో 35 మంది డాక్టర్లు కరోనావైరస్ బారినపడ్డారు. ఢిల్లీలో రెండో అతి పెద్ద ఆసుపత్రుల్లో రెండోది అయిన ఎయిమ్స్‌లో 35 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకినట్టు వచ్చిన వార్తలు కరోనాపై పోరులో పాల్గొంటున్న వైద్య సిబ్బందిని మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఢిల్లీలోని మరో అతి పెద్ద ఆస్పత్రి అయిన గంగా రామ్‌ ఆసుపత్రిలో గురువారం 37 మంది వైద్యులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు తెలిసిన మరునాడే ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలోనూ ఈ విధంగా 35 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకినట్టు తేలడమే వైద్య సిబ్బందిలో ఆందోళనకు కారణమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Delhi లో భారీగా పెరుగుతున్న COVID-19 కేసులు.. స్కూల్స్, కాలేజీలు మూసివేత 


ఇదిలావుంటే ఢిల్లీలోని 115 ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్స్, ఐసీయూ కెపాసిటీని కొవిడ్-19 పేషెంట్స్ కోసం కేటాయించాల్సిందిగా ఢిల్లీ సర్కార్ ఆదేశాలు జారీచేసింది. ఢిల్లీలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు (COVID-19 cases) భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రులు కొవిడ్-19 పేషెంట్స్‌కి సేవలు నిరాకరించరాదనే ఉద్దేశంతోనే ఢిల్లీ సర్కార్ (Delhi govt) ఈ ఆదేశాలు జారీచేసింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook