హైదరాబాద్:  దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ ప‌థ‌కం కింద రేషన్ కార్డు కలిగిన వారికి గ‌త మూడు నెల‌లుగా ఉచితంగా రేషన్ అందిస్తోంది. జాతీయ ఆహార భద్రత పథకం కింద కేంద్రం 81 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ ప్రయోజనాన్ని అంద‌జేస్తోంది. ఈ క్ర‌మంలోనే కేంద్ర ప్ర‌భుత్వం రేషన్ కార్డు కలిగిన వారికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Surya Grahanam 2020: వలయాకార సూర్యగ్రహణం.. రేపు ఖగోళంలో అద్భుతం


ఇదిలాఉండగా కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని మ‌రో మూడు నెల‌లు పొడిగించే యోచ‌న‌లో ఉన్న‌ట్లు కేంద్ర‌మంత్రి రామ్‌విలాస్ పాశ్వ‌న్ తెలిపారు. ఉచిత రేషన్ అందించే స్కీమ్‌ను మరో మూడు నెలలు పొడిగించాలని పది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. అస్సాం, పంజాబ్, కర్నాటక, తమిళనాడు, కేరళ, రాజస్తాన్ వంటి పలు రాష్ట్రాలు ఈ మేర‌కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారని వివరించారు. రాష్ట్రాల అభ్యర్థనలను  ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపించామని, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తుందని రామ్ విలాస్ పాశ్వ‌న్ స్ప‌ష్టం చేశారు. 
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ