Rajasthan Omicron cases: చాపకింద నీరులా విస్తరిస్తోన్న ఒమిక్రాన్... రాజస్థాన్‌లో కొత్తగా 21 కేసులు
Omicron: దేశంలో ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా రాజస్థాన్‌లో కొత్తగా 21 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.
Omicron cases in Rajasthan: ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరానికి గురిచేస్తోంది. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు (Omicron cases in India) రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ విస్తరించింది. రాజస్థాన్‌లో కొత్తగా 21 ఒమిక్రాన్ కేసులు (Omicron cases in Rajastan) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 43కు చేరింది. కొత్త కేసుల్లో జైపుర్‌లో 11, అజ్మేర్లో 6, ఉదయ్పుర్లో 3, మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ వ్యక్తికి వైరస్ సోకింది.
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 437కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 108 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత దిల్లీలో 79, గుజరాత్- 43, రాజస్థాన్- 43, తెలంగాణ- 38, కేరళ- 37, తమిళనాడు- 34, కర్ణాటక- 31 కేసులు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా 115 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు. ఒమిక్రాన్ నేపథ్యంలో..శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ (Night Curfew in Assam) అమలు చేయనున్నట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది.
Also Read: Third Wave in India: ఫిబ్రవరి నాటికి ఇండియాలో కరోనా థర్డ్ వేవ్: ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు!
కర్ణాటకలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా కోలార్ లోని ఓ మెడికల్ కళాశాలలో 33 మంది విద్యార్థులకు కరోనా (Covid-19) సోకింది. వారందరినీ ఐసోలేషన్ లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయ పాఠశాలలో 19 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి