ప్రజల గోడు వినండి.. ప్రధానిపై ఫైర్ అయిన చిదంబరం..
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రిచడంలో భాగంగా మార్చి 25న ప్రధాని లాక్ డౌన్ ప్రకటన చేసినా విషయం తెలిసిందే. కాగా మరోసారి దేశ ప్రజలనుద్దేశించి ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించి కరోనాపై సమైక్యపోరుకు సంకల్పాన్ని చాటాలంటూ పిలుపునిచ్చారు. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం మాట్లాడుతూ..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రిచడంలో భాగంగా మార్చి 25న ప్రధాని లాక్ డౌన్ ప్రకటన చేసినా విషయం తెలిసిందే. కాగా మరోసారి దేశ ప్రజలనుద్దేశించి ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించి కరోనాపై సమైక్యపోరుకు సంకల్పాన్ని చాటాలంటూ పిలుపునిచ్చారు. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం మాట్లాడుతూ.. ప్రజలు మీ మాట వినడమే కాదు, మీరు కూడా ప్రజలు చెప్పే మాటలు వినాలని హితవు పలికారు.
Read also : కరోనాని జయించిన తెలుగు యువకుడు.. ఏం సలహా ఇచ్చాడంటే!
అయితే మీరు చెప్పినట్టే ఏప్రిల్ 5వ తేదీన దీపాలు వెలిగిస్తామని, అదేరకంగా మీరు ప్రజలు, ఆర్థికవేత్తలు చెప్పే మాటలు వినాలని అన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి అవసరమైన చర్యలపై, వ్యవసాయరంగానికి సంబంధించిన అంశాలు ప్రస్తావిస్తారేమోనాని అందరూ భావించారని అన్నారు. లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఉద్యోగుల నుంచి దినసరి కూలీలు పడుతున్న అంశాలపై మాట్లాడకపోవడంపై ఘాటుగా స్పందించారు. కరోనా వైరస్ మహమ్మారిపై పూర్తి స్థాయి ముందు జాగ్రత్తలని పటిష్ఠపర్చాలని అన్నారు.
Read Also: ఏపీలో కరోనాతో తొలి మరణం.. ఆస్పత్రిలో చేరిన గంటలోనే కన్నుమూత
కాగా ప్రధాని మాట్లాడుతూ 5 రాత్రి 9 గంటలకు తమ ఇళ్లలో లైట్లు ఆపివేసి తొమ్మిది నిమిషాలపాటు దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ ఫోన్ టార్చ్ ను వెలిగించాలని కోరారు. కరోనా సంక్షోభ సమయంలో 130 కోట్ల మంది పౌరులు సంయుక్త సంకల్పంతో ఆలోచించాలని, ఆత్మ విశ్వాసాన్ని చాటుకోవాలని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Read also : తెలంగాణలో మరో 27 మందికి కరోనా.. 150 దాటిన కేసులు