India: ఒక్కరోజులో 48,661 కరోనా పాజిటివ్ కేసులు
భారత్‌లో గత ఐదు రోజులుగా ప్రతిరోజూ దాదాపు 50వేల వరకు కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Positive Cases In India) నమోదువుతన్నాయి. మరోవైపు కరోనా వ్యాక్సిన్ కోసం పలు సంస్థలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.
కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి దెబ్బకు విలవిల్లాడుతున్న దేశాలలో భారత్ ఒకటి. నిత్యం భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులతో పాటు భారీగా కోవిడ్19 మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో దేశంలో 48,661 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య (CoronaVirus Positive Cases In India) 13,85,522కు చేరింది. ‘హనుమాన్ చాలీసా పఠించండి.. కరోనాను జయించండి’
గత 24 గంటల్లో దేశంలో కరోనాతో పోరాడుతూ 705 మంది మరణించారు. భారత్‌లో మొత్తం కోవిడ్19 మరణాల సంఖ్య 32,063కు చేరింది. దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం 13,85,522 కేసులకుగానూ ప్రస్తుతం 4,67,882 యాక్టివ్ కేసులుండగా.. 8,85,577 మంది చికిత్స అనంతరం కరోనా బారి నుంచి కోలుకున్నారు. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్