Covid Third Wave: కర్ణాటకలో కరోనా థర్డ్‌వేవ్ భయం, వందమంది విద్యార్దులకు కరోనా పాజిటివ్
Covid Third Wave: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ప్రకంపనలు కన్పిస్తున్నాయి. కర్ణాటకలోని ఆ పాఠశాలలో ఏకంగా వందమంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Covid Third Wave: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ప్రకంపనలు కన్పిస్తున్నాయి. కర్ణాటకలోని ఆ పాఠశాలలో ఏకంగా వందమంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ప్రపంచాన్ని ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ వెంటాడుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 46 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ ఇండియాలో 25 కేసులకు చేరింది. అదే సమయంలో దేశంలో చాపకింద నీరులా కరోనా వైరస్ కేసులు విస్తరిస్తున్నాయి. స్కూల్స్, కళాశాలల్లో ఎక్కువగా కేసులు వెలుగుచూస్తున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ గుబులు రేపుతోంది. దేశంలో తొలి ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన బెంగళూరులోనే కరోనా థర్డ్‌వేవ్ ప్రకంపనలు కన్పిస్తున్నాయి. స్కూల్స్, కళాశాలల్లో బయటపడుతున్న కేసుల సంఖ్య కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave) భయాన్ని రేపుతోంది.
కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మగళూరులో(Chikmagalur)ఉన్న జవహర్ నవోదయ రెసిడెన్షియల్ పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. ఏకంగా 101 మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మొన్న 69 మంది, నిన్న 32 మంది విద్యార్ధులకు కరోనా నిర్ధారణైంది. ఇందులో 90 మంది విద్యార్ధులుండగా..11 మంది సిబ్బంది ఉన్నారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ సోకిందా లేదా అనేది తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్(Genome Sequencing) కోసం పంపించారు. వైరస్ బారినపడ్డ విద్యార్ధులు, సిబ్బందికి లక్షణాలు మాత్రం ఏవీ కన్పించలేదు. ప్రస్తుతం అందర్నీ ఐసోలేట్ చేశారు. ఒక్కసారిగా పెద్దమొత్తంలో కేసులు బయటపడటంతో నవోదయ పాఠశాలను(Navodaya School)వారం రోజులపాటు మూసివేశారు.
Also read: Omicron cases in India: మహారాష్ట్రలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook