Covishield vaccine price: కోవ్యాగ్జిన్ , కోవిషీల్డ్ వ్యాక్సిిన్‌లకు అనుమతి లభించడంతో ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ మరో పదిరోజుల్లోనే ప్రారంభం కానుంది. వాణిజ్యపరమైన అనుమతి లభిస్తే మాత్రం ఒక్కో వ్యాక్సిన్ వేయి రూపాయలంటుందని స్వయంగా సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి స్వదేశీ వ్యాక్సిన్ ( First indian vaccine ) భారత్ బయోటెక్ కంపెనీ ( Bharat Biotech company ) అభివృద్ధి చేసిన కోవ్యాగ్జిన్ ( Covaxin ), సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌లకు డీసీజీఐ ( DCGI ) అనుమతిచ్చేసింది. త్వరలో ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో అదార్ పూణావాలా కీలక ప్రకటన చేశారు. 


కమర్షియల్ అనుమతి లభిస్తే మాత్రం ఒక్కో వ్యాక్సిన్‌ను వేయి రూపాయలకు అమ్మనున్నట్టు సీరమ్ ఇనిస్టిట్యూట్ కంపెనీ సీఈవో అదార్ పూణావాలా ప్రకటించారు. తొలి కోటిమందికి మాత్రం కేవలం 2 వందలకే అందించనున్నామన్నారు. తరువాత టెండర్లు వేసి..వేర్వేరు ధరలకు వ్యాక్సిన్ అందిస్తామన్నారు. కోవిడ్ చికిత్సకు బూస్టర్ డోసు అవసరమని..అంటే మొత్తం వ్యాక్సిన్ ధర 2 వేలవుతుందన్నారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ ( Covishield )‌ను  ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా ( Oxford-Astrazeneca ) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. మరో పదిరోజుల్లో వ్యాక్సిన్ అందుబాటులో వస్తుందని..వచ్చే నెలలో దాదాపు 80 మిలియన్ల డోసుల్ని ఉత్పత్తి చేస్తామని అదార్ పూణావాలా స్పష్టం చేశారు. 


Also read: Uttar Pradesh: 25కి చేరిన మృతుల సంఖ్య.. ముగ్గురి అరెస్ట్