Covishield COVID-19 vaccine: కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభవార్త. ఇదివరకే 15 యూరప్ దేశాలు కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను గుర్తించగా, తాజాగా ఫ్రాన్స్ దేశం ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ ప్రయాణాలు చేయాలనుకునే వారు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే ఫ్రాన్స్‌లోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమ కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్‌కు మరింత మద్దతు పెరుగుతుండటంపై సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆదార్ పునావాలా హర్షం వ్యక్తం చేశారు. సీరం సంస్థ ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న విదేశీయులను ఫ్రాన్స్ దేశంలోకి అనుమతి ఇస్తూ శనివారం నాడు ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సీరం సీఈవో పునావాలా ట్వీట్ ద్వారా తెలిపారు. ఒక్కో దేశంగా ఆమోదం తెలుపుతూ నేటికి 16 యూరప్ దేశాలు కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ (Covishield Vaccine)ను గుర్తించాయి. వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని విశ్విసిస్తుండటంతో కోవిషీల్డ్‌కు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతుందన్నారు.


Also Read: Vaccine first dose తీసుకున్న తర్వాత కరోనా సోకితే ఏం చేయాలి ? Second dose ఎప్పుడు తీసుకోవాలి ?


‘ఇది నిజంగానే శుభవార్త. ఇప్పటివరకూ 16 యూరప్ దేశాలు సీరం సంస్థ ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్‌ను గుర్తింపునిస్తూ ఆమోదించాయి. ఈ వ్యాక్సిన్ తీసుకున్న విదేశీయులను ఫ్రాన్స్‌లోకి అనుమతి ఇస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రతి దేశానికి ప్రయాణానికి సంబంధించిన మార్గదర్శకాలను పాటించాలి. ఒక్కో దేశంలో COVID-19 వ్యాక్సిన్లు తీసుకున్న వారికి అనుమతుల నిబంధనలు ఒక్కో విధంగా ఉంటాయని’ సీరం సీఈవో ఆదార్ పూనావాలా ట్వీట్ చేశారు.


Also Read: Mint Benefits: పుదీనా తింటున్నారా, ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి


ఇదివరకే యూరోపియన్ దేశాలైన ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, ఫిన్లాండ్, జర్మనీ, గ్రీస్, హంగేరీ, ఐస్‌లాండ్, ఐర్లాండ్, లాత్వివా, నెదర్లాండ్, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న విదేశీయులకు దేశంలోకి రాకపోకలను అనుమతి ఇచ్చాయి. తాజాగా అనుమతిచ్చిన ఫ్రాన్స్ 16వ యూరప్ దేశంగా నిలిచింది. మెజార్టీ యూరప్ దేశాలు కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను స్వాగతిస్తున్నాయి. కోవిషీల్డ్‌తో పాటు కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను సైతం గుర్తించి, ప్రయాణాలకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలతో చర్చలు కొనసాగిస్తోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook