సుడిగుండంలో మధ్యప్రదేశ్ సర్కారు
మధ్యప్రదేశ్ సర్కారు రాజకీయ సుడిగుండంలో చిక్కుకుంది. రోజు రోజుకు కమల్ నాథ్ సర్కారు మరింత ఊభిలో కూరుకుపోయేందుకు సిద్ధంగా ఉంది. సర్కారుకు వ్యతిరేకంగా ఎదురు తిరిగిన 20 మంది ఎమ్మెల్యేలు ఏ క్షణమైనా రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని ఓ రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియాకు అనుకూలంగా ఉన్నవారే కావడం విశేషం. వారిలో పలువురు మంత్రులు కూడా ఉన్నారు. ఇటు కమల్ నాథ్ సర్కారులో ఉన్న మంత్రులు కూడా రాజీనామాలు సమర్పించారు. వారంతా కేబినెట్ ను పునరుద్ధరించాలని నిన్న సాయంత్రమే సీఎం కమల్ నాథ్‌కు సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు బెంగళూరుకు వెళ్లిన 20 మంది ఎమ్మెల్యేలు తమ ఫోన్లను స్విచాఫ్ చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం సహా మిగతా నేతలు ఎవరూ సంప్రదించడానికి వీలు లేకుండా పోయింది.
అటు కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ అధిష్ఠానం ఆయనకు వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో సభ్యత్వం ఇవ్వడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపుతారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఐతే దీనిపై ఇప్పటి వరకు జ్యోతిరాదిత్య సింధియా స్పందించలేదు. మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానంతోనూ సింధియాభేటీ అయ్యే అవకాశం కనిపించలేదు.
అటు మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను రాష్ట్ర బీజేపీ నిశితంగా గమనిస్తోంది. దాన్ని కాంగ్రెస్ అంతర్గత సమస్యగా మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాము ఎలాంటి అడుగు ముందుకు వేయడం లేదని తెలిపారు. ఐతే మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కారు కూలిపోవడం ఖాయమని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..