Crocodile Swallowed 10-year-old Boy in Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. షియోపూర్ జిల్లా రిజెంటా గ్రామంలో ఓ పదేళ్ల బాలుడిని మొసలి మింగేసిన ఘటన ఒక్కసారిగా అందిరిని షాక్‌కు గురి చేసింది. సోమవారం (జులై 11) మధ్యాహ్నం చంబల్ నదిలో స్నానం చేస్తుండగా.. బాలుడిపై ఒక్కసారిగా మొసలి దాడి చేసింది. ఆపై బాలుడిని మొసలి నదిలోకి లాకెళ్లి మింగేసింది. దాంతో బాలుడి కుటుంబీకులు మొసలి శరీరాన్ని రెండుగా చీల్చేందుకు ప్రయతించారు. విషయంలోకి వెళితే... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిజెంటా గ్రామస్తుడైన పదేళ్ల బాలుడు అతర్ సింగ్‌ సోమవారం మధ్యాహ్నం చంబల్ నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు. ఎలాంటి శబ్దం చేయకుండా వచ్చిన భారీ మొసలి అతడిపై దాడి చేసి.. నీటిలోకి లాక్కెళ్లింది. ఆనంతరం మింగేసింది. ఈ ఘటనను చూసిన అక్కడి జనం కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. బాలుడిని కాపాడాలనే ఉద్దేశంతో కర్రలు, తాడు, వల సహాయంతో మొసలిని పట్టుకున్నారు. ఆపై దాన్ని నది నుంచి బయటకు తీసుకువచ్చారు.


విషయం తెలుసుకున్న రఘునాథ్‌పూర్ పోలీసులు మరియు అటవీ శాఖ బృందం అక్కడికి చేరుకుంది. మొసలిని తిరిగి నదిలో వదిలేయాలని అధికారులు కోరగా.. బాలుడి కుటుంబీకులు, గ్రామస్థులు ససేమిరా అన్నారు. మొసలి కడుపులో బాలుడు బతికే ఉండొచ్చని, మొసలి శరీరాన్ని రెండుగా చీల్చుతామన్నారు. మొసలి మింగేస్తే చనిపోయి ఉంటాడని, బతికిఉండే అవకాశం లేదని అటవీ అధికారులు వారికి నచ్చజెప్పారు. మొసలి కడుపులో చిన్నారి కనిపించడం లేదని అధికారులు స్పష్టం చేసారు. దాంతో ఎట్టకేలకు సాయంత్రం నాటికి మొసలిని విడిచిపెట్టారు.


మొసలి కడుపులో చిన్నారి కనిపించడం లేదని అధికారులు గ్రామస్తులకు చెప్పడంతో.. బాలుడి మృతదేహం కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు బాలుడి మృతదేహం మంగళవారం ఉదయం కనిపించింది. పోస్ట్ మార్టం తర్వాత బాలుడి మృతదేహంను కుటుంబానికి అప్పగించారు. అయితే బాలుడిపై మొసలి దాడి చేసిన అనంతరం విడిపెట్టి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 


Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరింత తగ్గిన బంగారం ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే  


Also Read: Horoscope Today July 13 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రెండు రాశుల వారు ప్రేమలో విజయం సాధిస్తారు!  


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook