ల‌క్నో: బాత్ రూమ్‌లోకి కొండచిలువ ( Python) వచ్చింది అనే వార్తలను మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. బాత్ రూమ్‌లోకి కొండచిలువ వచ్చిందంటేనే ఆ ఇంటి యజమాని గుండె గుబేల్‌మంటుంది. మరి బాత్ రూమ్‌లో కొండచిలువను చూస్తేనే పరిస్థితి అలా ఉంటే.. ఇక బాత్ రూమ్‌లో మొసలిని ( Allegator) చూసిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది ? ఏంటి నమ్మలేకపోతున్నారా ? వాష్ రూమ్‌లోకి మొసలి ఎలా వస్తుందని ఆశ్చర్యపోతున్నారా ? ఐతే మీరు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో జరిగిన తాజా ఘ‌ట‌న గురించి తెలుసుకోవాల్సిందే. Also read: అప్పటివరకు International flights నిషేధం.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిరోజాబాద్ జిల్లాలోని మొహబ్బత్‌పూర్ గ్రామానికి చెందిన ఒక వ్య‌క్తి ఇంటి బయట ఉన్న మరుగుదొడ్డిలోకి మొసలి ప్రవేశించింది. బుధ‌వారం ఉద‌యం మరుగుదొడ్డిలో మొస‌లిని చూసి షాక్ అయిన సదరు ఇంటి యజమాని.. భయంతో కేక‌లు వేయడంతో ఇరుగుపొరుగు వారు పరిగెత్తుకొచ్చారు. మరుగుదొడ్డిలో 5 అడుగుల పొడవైన భారీ మొసలిని చూసి ఖంగుతిన్న స్థానికుల‌ు.. ఎలాగోలా ఆ మరుగుదొడ్డి తలుపులు మూసేసి అటవీ శాఖ అధికారులకు స‌మాచారం అందించారు. Also read: Twitter hacking: ట్విటర్ హ్యాకింగ్ ఎలా జరిగిందంటే..


అటవీ శాఖ సిబ్బంది వ‌చ్చి ఆ మొస‌లిని ( Crocodile rescued) సురక్షితంగా బోనులో బంధించి తీసుకెళ్లి అక్కడికి సమీపంలోని య‌మునా న‌దిలో విడిచిపెట్టారు. అటవీ శాఖ సిబ్బంది వచ్చి మొసలిని తీసుకెళ్లాకే ఆ గ్రామస్తులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరిగాకా గ్రామస్తులంతా తమ ఇళ్లకు వెళ్లి ముందుగా వారి మరుగుదొడ్ల పరిసరాలను ఒకసారి పరిశీలించుకున్నారట. మొసలి తమ ఇంట్లోకి ఎక్కడొస్తుందోననే భయం అలాంటిది మరి. Also read: spurious liquor: కల్తీ మద్యం తాగి 21 మంది మృతి