నిర్భయ కేసులో మరో ట్విస్ట్
నిర్భయ కేసు మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే చాలాసార్లు కోర్టులు డెత్ వారెంట్లు జారీ చేసినా . . వారి ఉరిశిక్ష అమలుకు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా మరో దోషి పవన్ గుప్తా.. సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. దీంతో ఉరి శిక్షపై మరోసారి ఉత్కంఠ రగులుతోంది.
నిర్భయ కేసు మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే చాలాసార్లు కోర్టులు డెత్ వారెంట్లు జారీ చేసినా . . వారి ఉరిశిక్ష అమలుకు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా మరో దోషి పవన్ గుప్తా.. సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. దీంతో ఉరి శిక్షపై మరోసారి ఉత్కంఠ రగులుతోంది.
నిర్భయ కేసులో సుప్రీం కోర్టు నలుగురిని దోషులుగా తేల్చింది. ఈ కేసులో చివరిసారిగా మార్చి 5న సుప్రీం కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. దీంతో మార్చి 20న అంటే రేపు(శుక్రవారం) వారికి ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. గడువు దగ్గరపడుతున్నకొద్దీ దోషుల్లో పల్స్ రేటు పెరుగుతోంది. తమకు ఉరి శిక్ష అమలు చేయవద్దని ఏదో ఒక రూపంలో కోర్టులను వేడుంకుంటూనే ఉన్నారు. న్యాయపరిమితులను ఉపయోగించుకుని శిక్ష నుంచి తప్పించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. తాజాగా మరో దోషి పవన్ గుప్తా.. సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు. అత్యాచారం జరిగిన సమయంలో తాను మైనర్ గా ఉన్నానని.. తనకు ఉరి శిక్ష అమలు చేయవద్దని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనకు విధించిన ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని పిటిషన్ లో పేర్కొన్నాడు.
Read Also: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం
పవన్ గుప్తా పెట్టుకున్న ఈ పిటిషన్ ను ఇవాళ ( గురువారం ) సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేయనుంది. ఆరుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించనుంది. ఈ క్రమంలో రేపు వారికి ఉరి శిక్ష అమలు చేస్తారా..? లేదా అనేది విచారణ తర్వాత తెలుస్తుంది. ఒకవేళ పవన్ గుప్తా శిక్షను యావజ్జీవంగా మారిస్తే.. మిగతా దోషులకు ఉరి శిక్ష ఎప్పుడు అమలు చేస్తారనేది తెలియాల్సి ఉంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.