first anniversary of repeal of article 370:  శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌ ( Jammu Kashmir ) లో మళ్లీ కర్ఫ్యూను విధించారు. ఆగస్టు 5తో జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ( article 370 ), ఆర్టికల్ 35ఏ ను రద్దు చేసి ఏడాది పూర్తికానుంది. ఈ మేరకు హింస, నిరసనలు హింస, నిరసనలు జరిగే అవకాశం ఉందన్న సమాచారం మేరకు శ్రీనగర్‌లో అధికారులు సోమవారం నుంచి బుధవారం సాయంత్రం వరకు కర్ఫ్యూను విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఈ నెల 5 వరకే ఉన్న కోవిడ్-19 ( Covid-19 ) నిబంధనల ఆంక్షలను సైతం 8వ తేదీ వరకు పొడిగించింది. Also read: Jammu Kashmir: ఎన్నికల్లో ఇక పోటీ చేయను


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. వేర్పాటువాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత శక్తులు ఆగస్టు 5న బ్లాక్ డేగా నిర్వహించేందుకు యోచిస్తున్నాయని, దీంతో హింస, నిరసనలకు అవకాశముందని అందుకే కర్ఫ్యూను తక్షణమే అమల్లోకి తెచ్చినట్లు శ్రీనగర్ డిఎం షాహిద్ ఇక్బాల్ చౌదరి తెలిపారు.


గతేడాది ఆగస్టు 5న కేంద్రప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్స్ 370, 35ఏ లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఈ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం లఢఖ్, కాశ్మీర్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.  Also read: Political Science: వేర్పాటువాదం చాప్టర్‌‌ను తొలగించిన NCERT