CWC Meeting LIVE Updates Key Congress Meet Begins, Decision On Elections For New Chief Likely: ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ (Congress) కీలక నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లఖింపూర్‌ ఖేరి (lakhimpur) ఘటన, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలతో పాటు పెట్రో, డీజిల్ ధరల పెరుగుదల తదితర అంశాలపై సీడబ్ల్యూసీ (CWC) ముఖ్యంగా చర్చించనుంది. ఇక కొత్త కాంగ్రెస్‌ చీఫ్‌ (New Congress Chief) ఎన్నికపై కూడా అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read:  IPL 2021 Final: రుతురాత్ గైక్వాడ్‌పై ప్రశంసలు కురిపించిన సీఎస్‌కే ఓపెనర్
ఈ భేటీలో పంజాబ్‌, (Punjab) ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలను కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే పంజాబ్‌ పరిణామాలపై ఇటీవల జీ-23గా పేర్కొనే కాంగ్రెస్‌ అసమ్మతి వర్గానికి చెందిన పలువురు నేతలు.. కాంగ్రెస్‌ అధిష్ఠానంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ (CWC) భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.


ఇక కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రస్తుతం సోనియా గాంధీ (Sonia Gandhi) కొనసాగుతున్నారు. ఆమె స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఎప్పటి నుంచో కాంగ్రెస్‌ పార్టీలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలను రాహుల్‌కు (Rahul) అప్పగించాలని కొందరు కోరుతున్నారు. దీంతో ఈ అంశంపై సీడబ్ల్యూసీ (CWC) భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.


కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షుడి ఎంపికకు మధ్యంతర ఎన్నికలకు బదులు.. పూర్తి స్థాయి సంస్థాగత ఎన్నికలే నిర్వహించాలన్న ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు సమచారం. ఈ అంశంపై నేటి సీడబ్ల్యూసీ భేటీ ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే పంజాబ్‌, (Punjab) యూపీ సహా పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు సంబంధించిన పార్టీ వ్యూహాన్ని కూడా నేటి సీడబ్ల్యూసీ (CWC) భేటీలో ఖరారు చేయనున్నట్లు సమాచారం.


Also Read : Kurnool Devaragattu Bunny Utsavam : కర్నూలు జిల్లా దేవరగట్టు బన్ని ఉత్సవంలో హింస, 100 మందికి గాయాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి