బంగ్లాను ఊడ్చేసిన ఫొని తుపాను ; పదుల సంఖ్యలో మరణాలు, భారీగా ఆస్తినష్టం
భారత్ నుంచి బంగ్లాదేశ్ కు పాకిన ఫొని తుపాను అక్కడ పదుల సంఖ్యలో ప్రాణాలు బలికొంది. భారీగా ఆస్తినష్టాన్ని మిగిల్చింది
భారత్ లో పెను బీభత్సం సృష్టించిన ఫొని తుపాను... కోల్ కతా మీదుగా పనియనించి బంగ్లాదేశ్ లో ప్రవేశించింది. బంగ్లాలో పెనుగాలుతో విజృంభించి తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. తుపాన దెబ్బకు అక్కడ ప్రాణ నష్టంతో పాటు ఆస్తినస్టం జరిగింది.
తుపాను బీభత్సం వల్ల అధికారిక లెక్కల ప్రకారం అక్కడ 14 మంది మృతి చెందారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో లక్షల హెక్టార్లలో పంటలు నీటమునిగాయి. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 16 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో ప్రాణ నష్టాన్ని కొంత మేరకు తగ్గించగలిగారు. ఇదిలా ఉండగా తీవ్ర వాయుగుండంగా మారిన ఫొని ..క్రమ క్రమంగా బలహీనపడింది. దీంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు