ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఎంఫాన్ తుపాన్.. మరికొద్దిగంటల్లో అత్యంత తీవ్ర తుఫాన్ గా బలపడనుంది. మరో 6 గంటల్లో అత్యంత తీవ్ర తుఫాన్ గా బలపడి తీరంవైపు దూసుకొస్తుందని భారత వాతావరణ శాఖ..IMD వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఎంఫాన్ తుపాన్.. మరికొద్దిగంటల్లో అత్యంత తీవ్ర తుఫాన్ గా బలపడనుంది. మరో 6 గంటల్లో అత్యంత తీవ్ర తుఫాన్ గా బలపడి తీరంవైపు దూసుకొస్తుందని భారత వాతావరణ శాఖ..IMD వెల్లడించింది. 


ప్రస్తుతానికి ఉత్తర ఈశాన్య దిశలో పయనిస్తున్న తుఫాన్.. మంగళవారానికి దిశను మార్చుకుంటుందని ఐఎండీ తెలిపింది. మంగళవారం ఉదయం నుంచి ఉత్తరదిశలో పయనించి..  బుధవారం వరకు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య  ప్రాంతాలైన దిఘా దీవులు, హతియా దీవుల  వద్ద  తీరం దాటుతుందని తెలిపింది.  బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ఎంఫాన్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. 


ఎంఫాన్ తుఫాన్ ప్రభావం కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో విపరీతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఐతే ఆంధ్రప్రదేశ్ పై తక్కువగానే ప్రభావం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. ఏపీలో మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయని తెలిపింది. ఐతే ఆకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది. ఒడిశా తీరంలో మత్య్సకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. 


[[{"fid":"185743","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అలాగే ఎంఫాన్ తుఫాన్ ప్రభావాన్ని తట్టుకునేందుకు జాతీయ విపత్తు నిర్వహణ శాఖకు చెందిన 17 బృందాలను ఏర్పాటు చేశారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో టీమ్స్ ను అప్రమత్తంగా ఉంచారు. 


ఏపీలో తుఫాన్ ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. నిన్న( ఆదివారం ) ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. సోమవారం, మంగళవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎంఫాన్ అత్యంత తీవ్ర తుపాన్‌‌గా మారే అవకాశం ఉన్నకారణంగా..  విశాఖపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ  పోర్టుల్లో రెండో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీచేశారు.  


మరోవైపు తెలంగాణలో కూడా సోమ, మంగళవారం అక్కడక్కడా తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..