మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం
మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పుణేలోని వాడర్వాడీ ప్రాంతంలో 15 గుడిసెలకు నిప్పు అంటుకుంది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మొత్తం 15 గుడిసెలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పుణేలోని వాడర్వాడీ ప్రాంతంలో 15 గుడిసెలకు నిప్పు అంటుకుంది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మొత్తం 15 గుడిసెలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
'కరోనా వైరస్'పై భయం వద్దు..!!
[[{"fid":"183350","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
తెల్లవారుజామున ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత భారీగా ఎగసిపడిన మంటల నుంచి తప్పించుకోవడానికి గుడిసెల్లో ఉన్న వారు పరుగులు పెట్టారు. మరోవైపు స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికే చాలా వరకు నష్టం జరిగిపోయింది. అప్పటి వరకు గుడిసెల్లో ఉంటున్న వారే మంటలు ఆర్పేందుకు నీటి సహాయంతో ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో కాస్త ఊపిరిపీల్చుకున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.