Dalit Boy Assaulted: ఉత్తరప్రదేశ్ లో రాయ్ బరేలీలో దారుణం జరిగింది. స్థానిక దళిత వర్గానికి చెందిన ఓ మైనర్ బాలుడ్ని హింసకు గురిచేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఆ దళిత బాలుడు చెవులు పట్టుకుని నేలపై కూర్చోపెట్టి అవమానించిన ఘటన చోటుచేసుకుంది. దాదాపుగా 2 నిమిషాల 30 సెక్లన్ల నిడివి కలిగిన ఈ వీడియో విపరీతంగా వైరల్ గా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిందితుల అరెస్టు


ఈ వీడియో ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఏప్రిల్ 10న జరిగిందని.. బాధితుడు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో పలువురు అగ్రవర్ణాలకు చెందిన వారిగా తెలిసింది. 


ఈ వీడియోలో ఉన్న బాధిత విద్యార్థి 10వ తరగతి చుదువుతున్నాడు. అతని తల్లి పొలం పని చేసుకుంటూ బతుకునీడుస్తుంది. ఓ అగ్రవర్ణ కులానికి చెందిన వ్యక్తి పొలంలో పని తాలూకూ డబ్బును అడిగేందుకు ఆ విద్యార్థి వెళ్లగా.. అతడిపై దుర్భాషలాడడం సహా అక్కడున్న వాళ్ల పాదాలను నాలుకతో నాకమని అవమానించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.  


Also Read: India Corona Cases: దేశంలో రెండింతలు పెరిగిన కరోనా కేసులు.. కరోనా ఫోర్త్ వేవ్ తప్పదా?


Also Read: Aadhaar Updation Process: ఆధార్ కార్డులో ఫోటో, పేరు, చిరునామా, పుట్టినతేదీ ఎలా మార్చాలి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook