Sputnik V Vaccine: కరోనా ప్రభావాన్ని అధికంగా ఎదుర్కొంటున్న రెండో దేశంగా భారతదేశం మారిపోయింది. గత నెల వరకు సాధారణ కేసులు నమోదు అవుతుండగా, తాజాగా రోజుకు లక్షన్నర పైగా కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ‘స్పుత్నిక్ వి’ అనే విదేశీ టీకాను అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చారు. రష్యా రూపొందించిన స్పుత్నిక్ వి కరోనా టీకాకు భారత ఔషధ నియంత్రణ మండలి(DCGI) ఆమోదం తెలిపింది. అంతకుముందు డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరిస్ క్లినికల్ టెస్టులు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరి పరిశీలించిన రిపోర్ట్ ఇచ్చిన అనంతరం అత్యవసర అనుమతికి ఆమోదం కోరుతూ డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ అనంతరం ఆమోదం పొందిన మూడో టీకాకా స్పుత్నిక్ వి నిలవనుంది. గత ఏడాది నుంచి డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరిస్ స్పుత్నిక్ వి కోవిడ్19 టీకా(COVID-19 vaccine)ను భారత్‌లో వినియోగించేలా చేసేందుకు శ్రమించింది. తాజాగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో టీకాకు ఆమోదం లభించింది. స్పుత్నిక్ వి టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ సైతం ఇటీవల పూర్తి చేసుకుంది.


Also Read: Covid-19 Deaths: ఎండలకు, కరోనా మరణాలకు ఉన్న లింక్‌పై నిపుణులు తేల్చిన విషయం ఇదే


ఈ టీకాను 18 లేదా అంతకన్నా ఎక్కువ వయసు వారికి ఇస్తారు. మొత్తం రెండు విడుతలుగా టీకాల పంపిణీ జరుగుతుంది. 0.5ఎంఎల్ పరిమాణంలో టీకాను ఇస్తారు. 21 రోజుల అనంతరం కరోనా వైరస్ (CoronaVirus) రెండో టీకా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే -18డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో కోవిడ్19 టీకాను నిల్వచేస్తారని కేంద్ర ఆరోగ్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న స్పుత్నిక్ టీకా 91 శాతం ప్రభావాన్ని చూపిస్తుందని గుర్తించారు. 


రష్యాలో మొదట్లో స్పూత్నిక్ వి టీకాను ఆమోదించిన సమయంలో పలు అనుమానాలు తలెత్తాయి. కానీ అనంతరం దీని మెరుగైన ఫలితాలు అనుమానాలకు చెక్ పెట్టింది. రెండో డోసు టీకా తీసుకున్న వారం తరువాత నుంచి రోగ నిరోధకశక్తి పెరుగుతుందని నిర్ధారించారు. కరోనా టీకాలు తీసుకునేవారికి జ్వరం వస్తే పారాసెట్మల్ ట్యాబ్లెట్ వేసుకుంటే చాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. లేదా సమీపంలోని డాక్టర్‌ను సంప్రదించి వెంటనే చికిత్స తీసుకుంటే సరిపోతుంది. మరోవైపు డాక్టర్ రెడ్డీస్ ఈ టీకాను భారత్‌కు తీసుకువస్తున్నందున వారి షేర్లు భారీగా పుంజుకోవడం గమనార్హం.


Also Read: New Coronavirus Symptoms: కరోనా వైరస్ కొత్త లక్షణాలు ఇవే, కనిపిస్తే టెస్టులు తప్పనిసరి 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook