DCGI Grants Permission to Covaxin and Covishield: డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ వ్యాక్సిన్లు అయిన కోవిషీల్డ్, కొవాగ్జిన్ లకు బహిరంగ మార్కెట్లోకి విక్రయించుకునేందుకు అనుమతించింది. ఈ షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన డీసీజీఐ.. మార్కెట్ ఆమోదించిన మెడికల్ షాపుల్లోనే వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇకపై ప్రజలందరూ ఆసుపత్రులు లేదా క్లినిక్ నుంచి కరోనా వ్యాక్సిన్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే కరోనా టీకాల స్టాక్ ను ప్రతి ఆరు నెలలకు ఒకసారి తమకు సమర్పించాలని DCGIకి పేర్కొంది. 



డీసీజీఐ నుంచి సాధారణ అనుమతి పొందిన క్రమంలో టీకాల ధరలను కోవిషీల్డ్, కొవాగ్జిన్ తయారీ ఫార్మా సంస్థలు నిర్ణయించనున్నాయి. బహిరంగ మార్కెట్లో రూ.275గా నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనికి రూ.150 జీఎస్టీ అదనమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతం కొవాగ్జిన్ ఒక డోసు ధర రూ.1200గా వసూలు చేస్తున్నారు (జీఎస్టీతో కలిపి). మరో టీకా కొవిషీల్డ్ ధర రూ.780గా విక్రయిస్తున్నారు. 


గతేడాది జనవరి 3న అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు ఈ రెండు టీకాలు అనుమతి పొందాయి. అయితే కొన్ని షరతులకు లోబడి ఈ రెండు టీకాలను సాధారణ అనుమతి ఇవ్వాలని నిపుణుల కమిటీ ఈనెల 9న ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు ఆ రెండు సంస్థలు సాధారణ అనుమతి కోసం అవసరమైన సమాచారం సమర్పించాయి. 


Also Read: Republic Day 2022: రిపబ్లిక్ డే పరేడ్ లో ఆకట్టుకున్న పలు రాష్ట్రాలు శకటాలివే!


Also Read: India Corona Cases Today: దేశంలో 4 కోట్ల మార్క్ ను దాటిన కరోనా కేసులు- పెరిగిన మరణాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook