ఉత్తరప్రదేశ్‌లో రాయబరేలిలో జాతీయ థర్మల్‌ విద్యుత్‌ సంస్థ (ఎన్‌టిపిసి)కి సంభవించిన ప్రమాదంలో మృతుల సంఖ్య 26కి చేరింది. కాగా గాయపడ్డ అనేక మంది పరిస్థితి విషమంగా ఉంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.  బుధవారం సాయంత్రం జాతీయ థర్మల్‌ విద్యుత్‌ సంస్థ (ఎన్‌టిపిసి)కి చెందిన 500 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పాదక క్షేత్రంలో బాయిలర్‌ పేలిన అగ్రిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఘటన జరిగిన సందర్భంలో 18 మంది చనిపోయారు. చికిత్స పొందుతూ ఈ రోజు 8 మంది మృత్యువాత పడ్డారు. కాగా  ఈ ప్రమాదంలో దాదాపు వంద మంది వరకు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులకు లక్నో, రాయబరేలి ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సనందిస్తున్నారు. గాయపడ్డా వారిలో 22 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా..


మృతులకు యుపి ముఖ్యమంత్రి ఆదిత్యా నాథ్ సంతాపం ప్రకటించి, చనిపోయినవారి కుటుంబసభ్యులకు  రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడి న వారికి రూ. 50వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి జెపి నడ్డా యుపి ఆరోగ్యశాఖ మంత్రితో ఫోన్‌లో మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. బాధిత కుటుం బాలకు వీలయినంత సహాయం అందచేయాలని ఆయన ఆరోగ్యశాఖ కార్యదర్శిని ఆదేశించారు.