నిర్మాణంలో వున్న అపార్ట్మెంట్ కూలి నలుగురు మృతి
నిర్మాణంలో వున్న అపార్ట్మెంట్ కూలి నలుగురు మృతి
బెంగళూరు: నిర్మాణంలో వున్న భవనం కూలి నలుగురు మృతిచెందిన ఘటన బెంగళూరులోని పులికేశి నగర్‌లో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏడుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బెంగళూరు పోలీసులు, సివిల్ డిఫెన్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలం వద్ద సహాయచర్యల్లో పాల్గొంటున్నాయి.
[[{"fid":"179097","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
భవనం కూలిపోవడానికి వెనుకున్న కారణాలు, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.