భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ( Ex president Pranab mukherjee ) ఆరోగ్యం మరింతగా విషమించింది. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ సోకడంతో..ఇంకా వెంటిలేటర్ పైనే కొనసాగిస్తున్నట్టు ఢిల్లీ కంటోన్మెంట్ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆగస్టు పదవ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్ ఆస్పత్రిలో ( Delhi Contonment Hospital ) చేరారు. మెదడుకు సంబంధించి ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. అదే రోజు కోవిడ్ 19 నిర్ధారణ పరీక్ష ( Test covid19 positive ) చేయగా..పాజిటివ్ గా తేలింది.  ఆ తరువాత పరిస్తితి కాస్త విషమించడంతో వెంటిలేటర్ పై పెట్టి చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడాయన ఆరోగ్యం మరింతగా క్షీణించిందని ఢిల్లీ కంటోన్మెంట్ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఊపరితిత్తుల ఇన్ ఫెక్షన్ ( Infection in lungs ) సోకిందని...ఇంకా వెంటిలేటల్ పైనే కొనసాగిస్తున్నామని వెల్లడించాయి. ఆయన ఆరోగ్య పరిస్థిితిని ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రణబ్ కోలుకునేలా ప్రార్ధనలు చేయాలంటూ ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ చేశారు. Also read: SBI: స్టేట్ బ్యాంక్ కస్టమర్ల కోసం కొత్త నియమాలు