Rajnath Singh: 101 రక్షణ వస్తువుల దిగుమతిపై నిషేధం
భారత ప్రభుత్వం (Govt Of India) ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.
101 Defence items banned in India: న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ( Govt of India ) ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో 101 రకాల రక్షణ వస్తువుల దిగుమతిపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ( Rajnath Singh ) ఆదివారం ప్రకటించారు. 'ఆత్మనిర్భర్ భారత్' ( Atma Nirbhar Bharat) కార్యక్రమానికి ఊతమివ్వడానికి భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్పటినుంచి ఆయుధాలతో సహా రక్షణశాఖ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. రానున్న నాలుగేళ్ల (2020- 2024) వరకు రక్షణ రంగ వస్తువుల దిగుమతులపై ఆంక్షలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. Also read: Covid-19- అమిత్‌షాకు ఇంకా.. టెస్టులే జరగలేదు
దాదాపు ఏడు లక్షల విలువైన వస్తువులను కొనుగోలు చేసేందుకు దేశీయంగానే ఒప్పందం కుదుర్చుకుంటామని ఆయన తెలిపారు. ఇప్పటినుంచి రైఫిళ్లు, రవాణా విమానాలు, హెలికాప్టర్లు, రాడార్ల వంటి రక్షణ పరికరాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోబోమని రక్షణ మంత్రి తెలిపారు. సాయుధ దళాల అవసరాలను గుర్తించి.. వాటిని దేశీయంగానే ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉందని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు. Also read: Refugee camp: శరణార్ధి కుటుంబంలో 11 మంది మరణం