Rajnath Singh Review on Agnipath: దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌ మంటలు చల్లారడం లేదు. పథకంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చినా నిరసనలు కొనసాగుతున్నాయి. అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాల్సిందేనని ఆర్మీ అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. ఇవాళ కూడా దేశంలోని చాలా చోట్ల నిరసన  ప్రదర్శనలకు ఆందోళనకారులు పిలుపునిచ్చారు. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అత్యంత రద్దీ ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లో భద్రతను రెట్టింపు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈనేపథ్యంలోనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ రెండోరోజు అగ్నిపథ్‌పై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులు, రక్షణ, హోంశాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరు అయినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. శనివారం సైతం ఉన్నతాధికారులతో రాజ్‌నాథ్‌ సింగ్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. అగ్నిపథ్‌ చేరిన వీరులకు అనేక తాయిలాలు ప్రకటించారు. అగ్నివీర్‌లకు కేంద్ర పారామిలిటరీ బలగాలు, అస్సాం రైఫిల్స్‌లో పది శాతం రిజర్వేషన్ కేటాయిస్తామని ప్రకటించారు.


దీనికి ఉన్నత స్థాయి సమావేశంలో పచ్చజెండా ఊపారు. నియామక నిబంధనల్లో మార్పులు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. ఐనా ఆందోళన తగ్గకపోవడంతో ఇవాళ భేటీకి ప్రాధాన్యాత సంతరించుకుంది. నేటి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పథకంలో మరిన్ని సవరణలు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు త్వరలో నియామకాలు ఉంటాయని త్రివిధ దళాలు వెల్లడించాయి. 


Also read:High Cholesterol Treatment: చెడు కొలెస్ట్రాల్‌ నుంచి విముక్తి పొందడానికి రోజూ ఇలా చేయండి..!


Also read:Konda Film: రేవంత్ రెడ్డి పులి.. దయాకర్ రావుకు డైపర్లే! తీన్మార్ పంచ్ లతో కొండా డాటర్ పొలిటికల్ ఎంట్రీ?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook