వ్యయాన్ని అదుపులో ఉంచుకునేందుకు ఆర్మీ బేస్ వర్క్ షాప్(ఏబిడబ్ల్యూ)లను నిర్వహించుకొనేందుకు రక్షణ శాఖ ప్రైవేటు కంపెనీలకు అనుమతి ఇచ్చింది. ఏబిడబ్ల్యూలను ప్రైవేటు కంపెనీలు ఆరు రాష్ట్రాల్లోని ఎనిమిది నగరాల్లో నడపనున్నాయి. ఈ కంపెనీలకు కావలసిన భూమి, పరికరాలు తదితర వనరులను కేంద్రమే సమకూర్చనుంది. నిపుణుల సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణశాఖ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాంబులు, క్షిపణల కొనుగోలుకు ఆమోదం 


కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారంనాడు రెండు కొనుగోలు ప్రతిపాదనలను ఆమోదించారు. మొట్టమొదటి ప్రతిపాదన రూ.1,254 కోట్ల వ్యయంతో 240 బాంబులను రష్యాకు చెందిన ఎం/ఎస్ జెఎస్సి రోసోన్బర్న్ ఎక్సపోర్ట్స్ కంపెనీ నుండి కొనుగోలు చేస్తారు. వీటిని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఉపయోగిస్తుంది.


రెండవ ప్రతిపాదనలో, 131 బార్క్ క్షిపణులను మరియు సంబంధిత సామగ్రిని ఎం/ఎస్ రెఫియెల్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్, ఇజ్రాయిల్ నుండి రూ.460 కోట్ల వ్యయంతో కొనుగోలు చేస్తారు. ఈ క్షిపణులను నౌకారంగం ఉపయోగిస్తుంది.