Bomb Threat: ఢిల్లీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్‌కాల్, అదుపులో నిందితుడు
Bomb Threat: ఢిల్లీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఎదురైంది. విమానాశ్రయంలో బాంబు ఉన్నట్టు ఫోన్‌కాల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అసలేం జరిగిందంటే..
Bomb Threat: ఢిల్లీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఎదురైంది. విమానాశ్రయంలో బాంబు ఉన్నట్టు ఫోన్‌కాల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అసలేం జరిగిందంటే..
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(Delhi International Airport) లో బాంబు ఉన్నట్టు ఇవాళ ఉదయం బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చింది. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఉదయం 7 గంటల 45 నిమిషాలకు ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లే విమానంలో బాంబు పెట్టినట్టు (Bomb threat phone call) ఓ అంగతకుడు ఫోన్ చేసినట్టు ఢిల్లీ విమానాశ్రయం డీసీపీ రాజీవ్ రంజన్ తెలిపారు. వెంటనే సంబంధిత ఏజెన్సీలన్నింటికీ సమాచారం అందించారు. ఢిల్లీ- పాట్నా విమానంలో(Delhi-Patna Flight) ఉన్న 52 మంది ప్రయాణీకుల్ని మరో విమానానికి తరలించి విస్తృతంగా తనిఖీలు చేశారు. బెదిరింపు ఫోన్‌కాల్ చేసిన వ్యక్తిని ఆకాష్ దీప్‌గా పోలీసులు గుర్తించడమే కాకుండా అదుపులో తీసుకున్నారు. అయితే తన కుమారుడి మానసిక స్థితి సరిగ్గా లేదని..విమానంలో కూర్చుని తన ఫోన్ నుంచి కాల్ చేశాడని ఆకాష్ దీప్ తండ్రి చెప్పినట్టు డీసీపీ రాజీవ్ రంజన్ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆకాష్ దీప్ మానసిక స్థితి సరిగా ఉందా లేదా అనేది వైద్యపరీక్షల్లో తేల్చనున్నారు.
Also read: Jammu kashmir Elections: త్వరలో జమ్ముకశ్మీర్ ఎన్నికలు, రాష్ట్ర హోదా ఉంటుందా లేదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook