Stage Collapse: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.  పోలీసుల ప్రకారం.. కల్కాజీ మందిర్‌లో శనివారం పెద్ద ఎత్తున భక్తులు జాగరణ కార్యక్రమంను నిర్వహించారు. దీనిలో వందల మంది భక్తులు పాల్గొన్నారు. అయితే.. భక్తులంతా ఒక్కసారిగా స్టేజీమీదకు చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా పెను ప్రమాదం  సంభవించింది. తొక్కిసలాట జరగటంతో ఒకరిపై మరోకరు పోయారు. దీంతో సంఘటన స్థలంలోనే ఊపిరాడకు ఒకరు మరణించారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీసీటీవీలో రికార్డు అయిన విజువల్స్ ప్రకారం, కీర్తనలు ఆలపించేటప్పుడు చాలా మంది భక్తులు ఉత్సాహంగా వేదికపైకి ఎక్కారు. దీంతో వేదిక కూలిపోవడంతో అక్కడక్కడా భక్తులు పరుగులు తీయడంతో గందరగోళం నెలకొంది. సరైన జాగ్రత్తలు తీసుకొకుండా కార్యక్రమం నిర్వహించినందుకు  నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. గాయలాపాలైన బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Read Also: Wedding: ''భర్తలతో విడిపోయిన భార్యలకు గుడ్ న్యూస్..'' కీలక తీర్పు వెలువరించిన హైకోర్టు..


అయితే.. ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని కూడా తెలుస్తోంది. ఆలయంలోని మహంత్ పరిసార్‌లో దుర్గా దేవి జాగ్రత (రాత్రిపూట మేల్కొలుపు) కు హాజరయ్యేందుకు దాదాపు 1500-1600 మంది ప్రజలు గుమిగూడారు.  ఘోర ప్రమాదం జరిగిన తర్వాత సిటీ పోలీస్ క్రైమ్ టీమ్ సంఘటనా స్థలాన్ని సందర్శిం. ప్రమాదంలో.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు సమాచారం.  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారణలో చేపట్టారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook