Building Collapses In Delhi: ఢిల్లీలో షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈశాన్య ఢిల్లీలోని విజయ్ పార్క్ ప్రాంతంలో  నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా.. సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే భవనం కూలడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. భవనం కుప్పకూలిన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భవనం కుప్పకూలడానికి ముందే.. అందులో ఉండేవారు వదిలి వెళ్లిపోవడం ఉపశమనం కలిగించే విషయం. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. భవనం కుప్పకూలిన దృశ్యం చాలా భయంకరంగా ఉన్నాయి. భవనం కూలుతున్న సమయంలో ప్రజలు కేకలు వేశారు. భవనం కూలిన దృశ్యాన్నంతా ఎవరో తన మొబైల్‌లో రికార్డు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనం కూలడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.


 




ఇటీవల కూడా ఢిల్లీలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అంతకుముందు మార్చి 1న ఉత్తర ఢిల్లీలోని రోషనారా రోడ్‌లోని నాలుగు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించగా.. ఆ తరువాత భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు అగ్నిమాపక సిబ్బందికి స్వల్ప గాయాలవ్వగా.. 50 మంది అగ్నిమాపక సిబ్బంది తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తాజాగా మరో 4 అంతస్తుల భవనం కుప్పకూలిపోవడం ఢిల్లీవాసులను భయాందోళనకు గురిచేస్తోంది. 


స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం నుంచే ఇంటి లోపల పెచ్చులు ఊడిపడుతున్నాయి. గోడ పైకప్పు కూడా కూలిపోవడంతో భవనం మొత్తం ఖాళీ చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ భవనం శిథిలావస్థకు చేరుకుందని కార్పొరేషన్‌ మాజీ కౌన్సిలర్‌ తెలిపారు. 20 గజాల స్థలంలో ఈ భవనాన్ని నిర్మించారు. అగ్నిమాపక శాఖ, సివిల్‌ డిఫెన్స్‌, స్థానికుల సహకారంతో శిథిలాల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి.


Also Read: Umesh Yadav: ఉమేష్‌ యాదవ్ ఇంట పండుగ వాతావరణం.. విషాద సమయంలో గుడ్‌న్యూస్   


Also Read: MCLR Rate: హోలీ పండుగ వేళ షాక్.. ఈ బ్యాంక్ వడ్డీ రేట్లు మళ్లీ పెరిగాయి  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.