ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కరోనా కేసుల పెరుగుదల..
దేశ రాజధానిలో గడిచిన 24 గంటల్లో 472 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8470కి చేరిందని ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
న్యూడిల్లీ: దేశ రాజధానిలో గడిచిన 24 గంటల్లో 472 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8470కి చేరిందని ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 24 గంటల్లో 187 మంది కోలుకుని డిశ్చార్జి కాగా మరణాలు సంభవించలేదని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఢిల్లీలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి వల్ల ఇప్పటివరకు 115 మంది మృతిచెందారని, మొత్తంగా ఈ వైరస్ బారిన పడిన 3045 మంది బాధితులు కోలకున్నారని అధికారికంగా వెల్లడించింది.
మరోవైపు తమిళనాడులో కూడా కరోనా మహమ్మారి ప్రభావం రోజు రోజుకు విజృంభిస్తోంది. ఇప్పటివరకు తమిళనాడులో 9227 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలాఉండగా ప్రభుత్వం కరోనా మహమ్మారి కట్టడికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రజల్లో భయం లేదని, నిరక్ష్యంగా వ్యవహరిస్తుండడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు వాపోతున్నారు. సామాజిక దూరం పాటించడం తప్పనిసరని అధికారులు, డాక్టర్లు, పోలీసులు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా కొంత మంది మాస్కులు పెట్టుకోకుండానే బహిరంగ ప్రదేశాలకు వస్తున్నారని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..