'కరోనా వైరస్' దేశంలో దారుణంగా విస్తరిస్తోంది. ఎంతకీ మహమ్మారి లొంగి రావడం లేదు. దేశవ్యాప్తంగా రోజు రోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే భారత దేశవ్యాప్తంగా కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 80 వేల చేరువ వరకు వెళ్లింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటి వరకు కరోనా మహమ్మారికి 2 వేల 293 బలయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో రోజూ సరాసరిగా  3 వందల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 17  వరకు లాక్ డౌన్ అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. 


దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించి దాదాపు 50  రోజులు అవుతోంది. ఈ క్రమంలో ఆర్ధిక వ్యవస్థ దిగజారిపోయింది. దీంతో పరిమిత ఆంక్షలతో పనులు చేసుకునేందుకు కేంద్రం అనుమతులు ఇస్తోంది. నిజానికి ప్రస్తుతం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇంకా పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేయాల్సి ఉంది. కానీ ఆర్ధిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని కాస్త సడలింపులు ఇచ్చారు.


మే 17 వరకు లాక్ డౌన్ అమలు చేసే అవకాశం ఉంది. ఐతే ఆ తర్వాత పరిస్థితి ఏంటి..? లాక్ డౌన్ ఎత్తేస్తే ఏం జరుగుతుంది...? కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందా...? మళ్లీ లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి వస్తుందా...? ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు...? 


మే 17 తర్వాత ఏం చేద్దాం...?, లాక్ డౌన్ పొడగించాలా...? వద్దా ...? అనే అంశాలపై సలహాలు సూచనలు ఇవ్వాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. రేపు సాయంత్రం 5 గంటల వరకు తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశిచిన 1031 నంబర్‌తోపాటు 8800007722 అనే వాట్సప్ నంబర్ , delhicm.suggestions@gmail.com అనే ఈ మెయిల్‌కు ప్రజలు తమ అభిప్రాయలు పంపించవచ్చని తెలిపారు.



జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..