దేశ రాజధాని ఢిల్లీలో చలి వాతావరణం భయం పుట్టిస్తోంది. చలి ధాటికి రాజధాని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ(బుధవారం) ఉష్ణోగ్రతలు మరింత కనిష్టానికి పడిపోయాయి. ఉదయం పూట కనిష్ట  ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి.  పొగమంచు ధాటికి ముందు ఉన్న వస్తువులు ఏమీ కనిపించకుండా పరిస్థితి దిగజారింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ రాజధాని ఢిల్లీలో  మాత్రమే కాదు పంజాబ్, రాజస్థాన్, హరియాణా, ఉత్తర ప్రదేశ్, బీహార్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం 5 గంటలకు 30 మీటర్ల కంటే విజుబులిటీ తక్కువగా ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరో రెండు మూడు రోజులు పరిస్థితి ఈ విధంగానే ఉంటుందని హెచ్చరించింది. ఉదయం 8 గంటలు దాటినా సూర్యుని జాడ కనిపించడం లేదు. పొగ మంచు కారణంగా అంతా చీకటిగానే ఉంది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి కనిపించింది.



Read Also:ఉత్తరాదిలో చలి దెబ్బకు రైళ్లు ఆలస్యం..!


 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..