Arvinder Singh Lovely: పార్లమెంట్‌ ఎన్నికల ముందర కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాక్‌ లభించింది. ఇప్పటికే మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు జాతీయ స్థాయిలో సహకరించడం లేదు. ఈ సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో గట్టిగా పోరాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ ఊహించని పరిణామం ఎదురైంది. పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఢిల్లీ కాంగ్రెస్‌లో కల్లోలం ఏర్పడింది. దేశవ్యాప్తంగా పార్టీ కుదేలవుతున్న సమయంలో ఢిల్లీ అతడి రాజీనామా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Lok Sabha Polls: ఐదుగురి ప్రాణం తీసిన 'ఓటు'.. వడదెబ్బతో రాలిన పండుటాకులు


 


ఢిల్లీ పీసీసీ అధ్యక్ష పదవికి అరవిందర్‌ సింగ్‌ లవ్లీ ఆదివారం రాజీనామా చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడంపై మొదటి అరవిందర్‌ సింగ్‌ వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల ఆప్‌ అధినేత, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ జైలుకు వెళ్లడంతో పార్టీకి చేటు చేస్తుందని అరవిందర్‌ భావిస్తున్నాడు. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ఆప్‌తో పొత్తు కొనసాగడం సరికాదనే అసంతృప్తితో ఉన్న అరవిందర్‌ సింగ్‌ ఎట్టకేలకు రాజీనామా చేశాడు. 'కార్యకర్తల అభిప్రాయాలకు భిన్నంగా అధిష్టానం ఆప్‌తో పొత్తు పెట్టుకుంది. అధిష్టానం నా అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం లేదు' అని చెప్పి అరవిందర్‌ సింగ్‌ రాజీనామా లేఖలో తెలిపారు. పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణాలను లేఖలో వివరిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు పంపారు.

Also Read: Freebies For Voters: ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీ, ఫ్రీ రైడ్‌


ఎవరు అరవిందర్‌ సింగ్‌?
ఢిల్లీలో కీలక నాయకుడిగా అరవిందర్‌ సింగ్‌ వెలుగొందుతున్నాడు. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ మంత్రివర్గంలో అరవిందర్‌ సింగ్‌ కీలక సభ్యుడిగా కొనసాగాడు. పలుమార్లు మంత్రిగా పని చేసిన అరవిందర్‌ 2017 ఏప్రిల్‌లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరాడు. అనూహ్యంగా తొమ్మిది నెలల తర్వాత మరుసటి ఏడాది 2018 ఫిబ్రవరిల మళ్లీ కాంగ్రెస్‌ పార్టీకి చేరాడు. తాజాగా మళ్లీ రాజీనామా చేయడం గమనార్హం. త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. అయితే బీజేపీ కుట్రలో అరవిందర్‌ సింగ్‌ రాజీనామా చేసినట్లు కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ ఆడుతున్న కుట్రగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter