Delhi Court Orders Bloomberg to Remove Article on Zee: జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌పై బ్లూమ్‌బెర్గ్‌ను ప్రచురించిన తప్పుడు కథనాన్ని తొలగించాలని ఢిల్లీ సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంస్థ పరువు నష్టం కలిగించేవిధంగా కథనం ఉండడంతో బ్లూమ్‌బెర్గ్‌కు ఆదేశాలు జారీ చేసింది. బ్లూమ్‌బెర్గ్ ప్రచురించిన కథనంపై ZEEL ఢిల్లీ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బ్లూమ్‌బెర్గ్ కథనం తప్పు అని.. కంపెనీ పరువు తీయాలనే ఉద్దేశంతో తప్పుడు కథనం ప్రచురించిందని Zee తరుఫున న్యాయవాది వాదించారు. ఈ మేరకు పిటిషన్‌ను విచారించిన కోర్టు బ్లూమ్‌బెర్గ్‌కు తప్పుడు కథనాన్ని తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. Zee కంపెనీ పరువు తీయాలనే ఉద్దేశంతో గత నెల 21న బ్లూమ్‌బెర్గ్ ఓ తప్పుడు నివేదికను ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నివేదిక కారణంగా కంపెనీ షేర్లు పడిపోయాయి. తప్పుడు నివేదికను తొలగించాలని బ్లూమ్‌బెర్గ్‌ను ఢిల్లీ సెషన్స్ కోర్ట్ ఆదేశించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"బ్లూమ్‌బెర్గ్ తప్పుడు నివేదకను ప్రచురించడం వల్ల కంపెనీ, పెట్టుబడిదారులు ఆర్థికంగా నష్టపోయారు. పరువు నష్టం కలిగించే ప్రచారం సర్క్యులేషన్ కారణంగా కంపెనీ స్టాక్ ధర దాదాపు 15 శాతం పడిపోయింది. కంపెనీలో 241 మిలియన్ల డాలర్ల అకౌంటింగ్ ఇష్యూస్ ఉన్నాయని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కనిపెట్టి.. నోటీసులు ఇచ్చిందని కథనం ప్రచురించింది. అయితే వాస్తవానికి సెబీ నుంచి అలాంటి నోటీసులు ఏవే రాలేదు. రెగ్యులేటర్ నుంచి ఎలాంటి ఆర్డర్ లేకుండానే జీ కంపెనీలో ఆర్థిక అవకతవకలు ఉన్నాయంటూ బ్లూమ్‌బర్గ్ తప్పుడు కథనం ప్రచురించింది. కంపెనీ ఈ విషయాన్ని ఖండించింది" అని జీ వెల్లడించింది.


జీ తరపు న్యాయవాది జడ్జి వాదిస్తూ.. బ్లూమ్‌బర్గ్ ప్రచురించిన కథనం తొలగించకపోతే కంపెనీకి కోలుకోలేని ఏర్పడుతుందన్నారు. ఈ మేరకు పిటిషన్‌ను శుక్రవారం విచారించిన అదనపు జిల్లా న్యాయమూర్తి హర్జ్యోత్ సింగ్ భల్లా ZEEకి ఉపశమనం కల్పిస్తూ కథనాన్ని తొలగించాలని బ్లూమ్‌ బర్గ్‌ను ఆదేశించారు. తదుపరి విచారణ తేదీ వరకు ఏదైనా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లో కథనాన్ని పోస్ట్ చేయడం, సర్క్యులేట్ చేయడం లేదా ప్రచురించడం వంటివి చేయకూడదని స్పష్టం చేశారు. కోర్టు ఆర్డర్ అందిన వారంలోగా తన ప్లాట్‌ఫారమ్ నుంచి పరువు నష్టం కలిగించే కథనాన్ని తీసివేయాలని బ్లూమ్‌బెర్గ్‌కు ఆదేశాలు జారీ చేశారు.


Also Read: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..


Also Read: Poco M6 5G Vs Poco M6 Pro 5G: తక్కువ ధరలో లభించే ఈ రెండు శక్తివంతమైన మొబైల్స్‌లో ఇదే బెస్ట్‌..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter