నిర్భయ కేసు.. చివరి అంకానికి చేరుకుంది. ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురికి మరో వారం రోజుల్లో ఉరి శిక్ష అమలు చేయనున్నారు. వారు ఈ లోగా అన్ని న్యాయ పరిమితులు పూర్తి చేసుకోవాల్సి ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో తుది తీర్పు వెలువడినా.. దోషులకు ఉరి శిక్ష అమలు చేయడంలో తాత్సారం జరుగుతోంది. ఐతే వారికి ఉరి శిక్ష త్వరలోనే అమలు చేస్తారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. కానీ కోర్టులు వారికి  న్యాయపరిమితులు ఉపయోగించుకునేందుకు సమయం ఇస్తుండడంతో ఉరి శిక్ష అమలు ఆలస్యం అవుతోంది. ఐతే ఈ కేసులో తుది విడత వాదనలు విన్న ఢిల్లీ కోర్టు .. దోషులకు న్యాయ పరిమితులు ఉపయోగించుకునేందుకు కేవలం వారం రోజులు గడువు ఇచ్చింది. ఈ లోగా అన్ని న్యాయపరిమితులు పూర్తి చేసుకోవాలని తేల్చి చెప్పింది.  ఆ తర్వాత  నలుగురు నిందితులు ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్ లకు ఒకేసారి ఉరి శిక్ష అమలు చేసే అవకాశం ఉంది. 


నిర్భయ తల్లి హర్షం


మరోవైపు ఢిల్లీ కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు ఆశాజనకంగా ఉందని  అన్నారు. వారం రోజుల్లో దోషులకు ఉన్న న్యాయపరిమితులు పూర్తి చేసిన తర్వాత వారికి ఒకేసారి ఉరి శిక్ష అమలు చేస్తారని తెలిపారు.