దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు శుభవార్త. కరోనా కేసుల (Delhi COVID19 cases) విషయంలో ఇతర రాష్ట్రాలు సతమతమవుతుంటే ఢిల్లీ మాత్రం సురక్షిత స్థానానికి చేరింది. కరోనా వైరస్ కేసులు భారత్‌లో మొదలైనప్పుడు ఢిల్లీ భారీ సంఖ్యలో కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే ప్రస్తుతం ఢిల్లీలో కరోనా సమస్య చాలా తగ్గిందని, కరోనా కేసుల రికవరీ రేటు (Delhi COVID19 cases Recovery rate) 84శాతానికి చేరుకుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. తెలంగాణ సర్కార్ ప్రత్యేక కరోనా యాప్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గడిచిన 24 గంటల్లో 954 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య (Delhi CoronaVirus Cases) 1,23,747కు చేరుకుంది. అయితే మొత్తం కేసులకుగానూ 1,04,918 మంది చికిత్స అనంతరం కోవిడ్19 బారి నుంచి కోలుకున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం దాదాపు 16వేల యాక్టివ్ కరోనా కేసులున్నాయని, రికవరీ రేటు 84శాతానికి చేరుకుందని సత్యేంద్ర జైన్ వెల్లడించారు. ‘సాహో’ నటి Evelyn Sharma Hot Photos


కాగా, గత నెలలో స్వయంగా ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ సైతం కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. ప్లాస్లా థెరపీ తర్వాత వేగంగా కోలుకున్నారు, మునుపటిలా తన శాఖ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు. కరోనా విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి, కీలక చర్యలు తీసుకోవడం.. అధికారులను అప్రమత్తం చేయడంతో రోజురోజుకూ పరిస్థితి మెరుగుపడుతోంది. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..