BJP Leader Murder:ఢిల్లీలో బీజేపీ నేత హత్య తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక మయూర్ విహార్‌లో బుధవారం (ఏప్రిల్ 20) బీజేపీ నేత జీతు చౌదరి (42) హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆయన్ను గన్‌తో కాల్చి చంపారు. చౌదరి ఇంటి బయటే ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల అనంతరం వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించినప్పటికీ... అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి 8.15 గంటల సమయంలో జీతు చౌదరి హత్య జరిగింది. స్థానిక పోలీస్ ప్యాట్రోలింగ్ నిర్వహిస్తుండగా మయూర్ విహార్ ప్రాంతంలోని ఓచోట స్థానికులు గుమిగూడి కనిపించారు. అక్కడికి వెళ్లి చూడగా... ఓ వ్యక్తి రక్తపు మడుగులో కింద పడి ఉన్నాడు. మృతుడిని జితేందర్ అలియాస్ జీతు చౌదరిగా గుర్తించినట్లు తెలిపారు.


ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారం బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు జీతు చౌదరిపై కాల్పులు జరిపారు. ఇందులో ఒక బుల్లెట్ జీతు తలలో దిగగా... మరో బుల్లెట్ కడుపులో దిగింది. దీంతో జీతు చౌదరి అక్కడికక్కడే కుప్పకూలగా నిందితులు పారిపోయారు.


సంఘటనా స్థలం నుంచి ఖాళీ క్యాట్రిడ్జ్, ఇతర కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని... ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు.



Also Read: Tatineni Ramarao: దిగ్గజ సినీ దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూత.. అప్పట్లోనే ఆయనది ప్యాన్ ఇండియా రేంజ్..


Also Read: Horoscope Today April 21 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు.. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook