ఆప్ ఎంఎల్ఏలు తనను కొట్టారని సంచన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ అన్షు ప్రకాష్. సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అజయ్ దత్, ప్రకాష్ జర్వాల్ లు తనపై చేయిచేసుకున్నారని సీఎస్ ఆరోపించారు. ఈ ఘటన కేజ్రీవాల్ కళ్లముందే జరిగిందని.. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఇంటి వెళ్లి ఫిర్యాదు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వ ప్రణాళికల గురించి తెలుసుకునేందుకు సోమవారం రాత్రి సీఎం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లానని, అక్కడున్న కొంతమంది ఆప్ ఎంఎల్ఏలు (ఇద్దరు) తిట్ల దండకం అందుకున్నారని, చేయిచేసుకున్నారని సీఎస్ ప్రకాష్ ఆరోపించారు. ఈ ఘటన జరిగిన వెంటనే లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఇంటికి వెళ్లిన సీఎస్.. క్రేజీవాల్ తన ఎమ్మెల్యేలను ఆపే ప్రయత్నం కూడా చేయలేదని ఆరోపించారు. తనపై  చేయిచేసుకున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.


కాగా, గత కొంతకాలంగా సీఎస్, ఆప్ పార్టీ ఎమ్మెల్యేలు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తొత్తుగా మారిన అనిల్ బైజల్ (లెఫ్టినెంట్ గవర్నర్) ప్రతి పథకాన్నీ అడ్డుకుంటున్నారని, ఆయనకు సీఎస్ మద్దతుగా నిలుస్తున్నారని కేజ్రీవాల్ ఇటీవల ఆరోపించారు.