Delhi Visibility: దేశ రాజధాని వాతావరణం ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. శీతాకాలంలో ప్రధానంగా ఢిల్లీ నగరం రెండు సమస్యల్ని ఎదుర్కొంటుంది. ఒకటి వాయు కాలుష్యమైతే రెండవది పొగమంచు. ఒకటి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తే రెండవది ప్రయాణాన్ని ప్రమాదకరం చేస్తుంది. ఇప్పుడు ఢిల్లీని విజిబిలిటీ సమస్య వెంటాడుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శీతాకాలం పీక్స్‌కు చేరుతోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశమంతా చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. ఢిల్లీ కనీస ఉష్ణోగ్రత ఇప్పుడు 6-7 డిగ్రీలకు పడిపోయింది. ఫలితంగా చలి విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా పొగమంచు ఆవహించి ఉంటోంది. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. దట్టంగా కమ్మేసిన పొగమంచుతో ఎదురుగా ఏముందో కన్పించడం లేదు. విజిబిలిటీ పూర్తిగా పడిపోతోంది. 


పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పొగమంచు చాలా తీవ్రంగా ఉందని. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ప్రాంతంలో విజిబిలిటీ 50 మీటర్లకు పడిపోయింది. పంజాబ్ అమృతసర్ విమానాశ్రయంలో విజిబిలిటీ 0కు పడిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. విజిబిలిటీ సున్నాకు పడిపోవడంతో దాదాపు 110 విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. కొన్ని రద్దయ్యాయి. ఉదయం 10 గంటలకు సైతం రహదారులన్నీ పొగమంచుతో నిండిపోయాయి.
అటు రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. మొత్తం 25 రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి.



మొన్నటి వరకూ కాలుష్యం కారణంగా ఎయిర్ క్వాలిటీ పడిపోయి తీవ్ర ఇబ్బంది పడిన ఢిల్లీ ప్రజానీకానికి ప్రతి శీతాకాలంలో ఎదురయ్యే రెండవ సమస్య ఇది విజిబిలిటీ తగ్గిపోవడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లోంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. అత్యవసరమైతేనే తప్ప బయటటకు రావడం లేదు.


Also read: Rahul Gandhi Padayatra: మరో యాత్రకు సిద్ధం, జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook