Delhi Fire Accident: ఘోరప్రమాదం జరిగింది. ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఆరుగురి నవజాత శిశువులు దుర్మారణం పాలయ్మారు. ఈ ఘటన శనివారం రాత్రి ఢిల్లీ వివేక్‌ విహార్‌ ఆస్పత్రిలోని బేబీ కేర్‌ సెంటర్లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరి కొంతమంది శిశువులు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిని రిస్క్యూ టీం సిబ్బంది రక్షించారు. ఈ ఘటనలో 12 మంచి నవజాత శిశువులను రిస్క్యూ చేయగా.. అందులో ఆరుమంది చిన్నారులు చనిపోయారు. మరొక నవజాత శిశువు వెంటిలేటర్‌పై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. మిగతా ఐదు మంచి శిశువులను ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే శనివారం రాత్రి 11.32 సమయంలో వివేక్‌ ఆస్పత్రిలోని ఐటీఐ బ్లాక్ బీ బేబీ కేర్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వారిని కాపాడేందుకు ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు. వెంటనే 9 అగ్నిమాపక యంత్రాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదంలో మంటలు పక్కనే ఉండే ఇతర బిల్డింలకు కూడా వ్యాపించాయి. కానీ, ఎలాంటి ప్రాణాపాయం ఏర్పడలేదు. అందరిని సురక్షితంగా రిస్క్యూ టీం కాపాడారు.


ఇదీ చదవండి:  రేపే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష, నిమిషం ఆలస్యమైనా అనుమతించరు జాగ్రత్త


మరో ఘటనలో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని ఓ గేమింగ్‌ జోన్‌ లో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ఈ ఘటనలో 27 మంది చనిపోయారు. ఇందులో 9 మంచి చిన్నారులు ఉన్నారు. మృతదేహాలు కూడా గుర్తుపట్టని విధంగా కాలిపోయాయని అసిస్టెంట్‌ కమిషనర్‌ వినాయక్ పటేల్‌ తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, వైస్‌ ప్రెసిడెంట్‌ జగదీప్‌ ధనకర్ కూడా తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


ఇదీ చదవండి: కొంప ముంచిన గూగుల్ తల్లి.. హైదరాబాద్ టూరిస్టులకు ఊహించని షాక్..


గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్ ఈ ఘటనకు సంబంధించి సిట్‌ కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గేమింగ్‌ జోన్‌ యువరాజ్‌ సింగ్‌ సొలాంకి అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. టీఆర్‌పీ గేమింగ్‌ జోన్‌ లో శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ప్రస్తుతం అదుపులోకి వచ్చాయి. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook