Liquor Door Delivery: దేశంలో తొలిసారిగా ఢిల్లీ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. మందుబాబులకు నిజంగా ఇది శుభవార్తే. కావల్సినంత మద్యం ఇకపై..ఇంటికే చేరుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సంక్రమణ నేపద్యంలో లిక్కర్ డోర్ డెలివరీ (Liquor Door Delivery) అంశం చర్చనీయాంశమైంది. కరోనా మొదటి వేవ్ సమయంలో అన్‌లాకింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు లిక్కర్ షాపుల వద్ద భారీగా జనం బార్లు తీరడంతో డోర్ డెలివరీ అంశం చర్చకొచ్చింది. ఇప్పుడు సెకండ్ వేవ్(Corona Second Wave) సంక్రమణ తగ్గుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అన్‌లాకింగ్ ప్రక్రియ ప్రారంభించింది. కరోనా కేసుల పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గడంతో అరవింద్ కేజ్రీవాల్(Arvind kejriwal) ప్రభుత్వం అన్‌లాక్ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో మద్యం హోం డెలివరీకు అనుమతిచ్చింది. మొబైల్ యాప్ లేదా వెబ్ పోర్టల్ ద్వారా ఆర్డర్ చేసినవారికే హోం డెలివరీ సదుపాయం కల్పించనున్నారు.


ఢిల్లీలో కొత్త ఎక్సైజ్ చట్టం(Delhi New Excise Act) 2021 ప్రకారం మొబైల్ యాప్ లేదా వెబ్ పోర్టల్ ద్వారా ఆర్డర్ చేస్తే..మద్యం హోం డెలివరీ (Liquor Home Delivery) కానుంది. పాత చట్టం ప్రకారం ఎల్ 13 లైసెన్స్ ఉన్నవారికే ఈ అవకాశముండేది. ఇప్పుడు ఎల్ 14 లైసెన్స్ ఉన్నవారు మాత్రం హోం డెలివరీ చేయగలరు. లిక్కర్ హోం డెలివరీ విధానంతో లిక్కర్ షాపుల వద్ద రద్దీ భారీగా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో అమ్మకాలు కూడా పెరగవచ్చని భావిస్తున్నారు. 


Also read: Black Fungus Target: బ్లాక్ ఫంగస్ ఎవర్ని..ఏ వయస్సువారిని టార్గెట్ చేస్తుందంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook