Yamuna River: మళ్లీ ప్రమాద స్థాయిని దాటిన యమునా నది.. అలర్ట్ అయిన కేజ్రీవాల్ సర్కార్..
Yamuna River: దేశరాజదాని ఢిల్లీలో యమునా నది మళ్లీ డేంజర్ మార్క్ ను దాటింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు కారణంగా యమునాలో మళ్లీ నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
Yamuna Danger Mark in Delhi: ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాంతో యమునా నది (Yamuna River) ఉప్పొంగి ప్రవహిస్తోంది. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి దిగువకు భారీగా నీరు విడుదలవడంతో యమునా నదిలో నీటిమట్టం మళ్లీ తారస్థాయిని చేరింది. ముఖ్యంగా ఢిల్లీలో యమునా నది మళ్లీ ప్రమాద స్థాయిని (205.33 మీటర్లు) దాటింది. ఈ ఉదయం 10 గంటలకు నదిలో 206.10 మీటర్ల నమోదైంది. ఇది సాయంత్రానికి 206.7 మీటర్లకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
హిమచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో యమునా నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఈనేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ అప్రమత్తమైంది. అంతేకాకుండా హిండన్ నది నీటిమట్టం పెరగడం వల్ల నోయిడాలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. నదీ పరివాహాక ప్రాంతాల ప్రజలను అధికారులు తరలించారు.
Also Read: Godavari Floods: గోదావరికి పోటెత్తుతున్న వరద నీరు, రేపు ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
జూలై 10 సాయంత్రం 5 గంటలకు యమునా నది నీటిమట్టం డేంజర్ స్థాయిని దాటింది. దీని కారణంగా దేశరాజధాని ఢిల్లీలో వరదలు సంభవించాయి. నీటిమట్టం క్రమంగా 208.66 మీటర్ల గరిష్ట స్ఖాయికి చేరుకుని.. ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది. మళ్లీ ఇప్పుడు వరద ఉద్ధృతి పెరిగింది.
Also Read: Taimar Valley: దేశంలో భయం గొలిపే వ్యాలీ, ఇక్కడికి రాగానే తేదీ సమయం మారిపోతుంటాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook