Gautam Gambhir Case: గౌతమ్ గంభీర్ కోవిడ్ మందుల నిల్వ కేసులో స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు
Gautam Gambhir Case: కోవిడ్ మందుల అనధికారిక నిల్వ విషయంలో మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ఊరట లభించింది. ట్రయల్ కోర్టులో జరుగుతున్న విచారణపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.
Gautam Gambhir Case: కోవిడ్ మందుల అనధికారిక నిల్వ విషయంలో మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ఊరట లభించింది. ట్రయల్ కోర్టులో జరుగుతున్న విచారణపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.
కోవిడ్ సెకండ్ వేవ్(Corona Second Wave) సమయంలో బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఓ కేసులో ఇరుక్కున్నారు. కోవిడ్ మందుల్ని అనధికారికంగా నిల్వ చేశారనే వ్యవహారంలో కేసు ఎదుర్కొంటున్నారు. నిర్ణీత ధరకు మందుల్ని అమ్మకుండా ఓ మెడికల్ క్యాంప్ ద్వారా ఉచితంగా సరఫరా చేస్తున్నారనేది గౌతమ్ గంభీర్‌పై ఉన్న ఆరోపణ. అయితే కోవిడ్ సమయంలో ప్రజలకు సహాయం చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమానికి ఎటువంటి లైసెన్సులు అవసరం లేదని..ఇటాంటి కార్యక్రమాలపై క్రిమినల్ కేసులు పెట్టడమంటే న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని గౌతమ్ గంభీర్ తరపు న్యాయవాది తెలిపారు.
తమ వద్దకు మొత్తం 2 వేల 6 వందల స్ట్రిప్‌ల మందులు రాగా, కేవలం 16 రోజుల వ్యవధిలో 2 వేల 4 వందల స్ట్రిప్‌లను ప్రజలకు అందించినట్టు చెప్పారు. ఈ కేసు ప్రస్తుతం ట్రయల్ కేసులో విచారణలో ఉంది. ఈ కేసుపై ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)స్టే విధించింది. గౌతమ్ గంభీర్‌తో(Gautam Gambhir) పాటు కుటుంబసభ్యులు కూడా కేసులో నిందితులుగా ఉన్నారు. మందుల్ని అందించిన ఫౌండేషన్‌లో గౌతమ్ గంభీర్ కుటుంబసభ్యులు ట్రస్టీలుగా ఉన్నారు. ఈ కేసుపై స్పందించాలని ఢిల్లీ డ్రగ్ కంట్రోల్ అథారిటీని హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణను వాయిదా వేస్తూ..ప్రొసీడింగ్స్‌పై స్టే విధించింది.
Also read: Auto Debit New Rules: ఆటోడెబిట్ ఇకపై అంత ఈజీ కాదు, అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook