Man Brutally Attack With Sharp Knife On Girl In Mukherjee Nagar: మహిళల భద్రతకు కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకొస్తున్నాయి. అయిన కూడా మహిళలపై దాడులు మాత్రం ఆగడం లేదు. కొన్ని చోట్ల ప్రేమపేరుతో దాడులు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల తన ప్రేమను నిరాకరించినందుకు కూడా అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కట్నంతేలేదని, అందంగాలేదని వేధింపులకు గురిచేస్తున్నారు. అంతే కాకుండా.. డబ్బులు కోసం, తమ అవసరాల కోసం ప్రేమిస్తున్నట్లు నటించి ఆతర్వాత హత్యలు చేస్తున్నారు. ఇంట్లో నుంచి బైటకు వెళ్లిన మహిళ ఆఫీసు, బస్టాండ్, రైల్వేస్టేషన్  ఇలా ప్రతిచోట్ల కామాంధుల వేధింపులకు గురౌతున్నారు. ఈ వేధింపులు భరించలేక చివరికి పోలీసు స్టేషన్ లకు వెళ్తే ..అక్కడ పోలీసులు కీచకులుగా మారి వేధిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


పోలీసులు కూడా వేధింపులు, అత్యాచారానికి పాల్పడిన ఘటనలు తరచుగా వార్తలలో నిలుస్తున్నాయి. ఎందరు అమ్మాయిలు, రోడ్ల మీద పైశాచికంగా దాడులకు గురైన ఘటనలు వార్తలలో నిలిచాయి. తాజాగా, దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం మహిళల భద్రత ఎంత వరకు సెఫ్టీ ఉందని అందరిని షాకింగ్ కు గురిచేస్తుంది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


దేశ రాజధానిలో ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. ముఖర్జీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది. ఈ నెల 22 తేదీన జరిగిన కత్తిపొట్ల వ్యవహరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమన్ అనే యువకుడు.. రోడ్డుపైన వెళ్తున్న యువతిని వెంటపడ్డాడు. అంతే కాకుండా.. ఆమెను పలుమార్లు కత్తితో పొడిచాడు. రోడ్డుపైన వెళ్తున్న కొందరు అతగాడిని అడ్డుకున్నారు. అమన్ ను అక్కడున్న వారి సహాయంతో పోలీసులకు అప్పగించారు.


Read More: Guntur Kaaram: కుర్చీ మడతపెట్టి పాటకు మాస్ స్టెప్పులు వేసిన పెళ్లికూతురు.. వైరల్ గా మారిన వీడియో..


ఈ క్రమంలో యువతికి తీవ్ర రక్త స్రావమైంది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈ క్రమంలో అమన్ ను స్థానికంగా కొందరు మతిస్థిమితం లేని వ్యక్తిగా కామెంట్లు చేసేవారని, యువతి కూడా గతంలో పిచ్చోడి మాదిరిగా కామెంట్లు చేసిందని అందుకే కత్తితో దాడికి పాల్పిడినట్లు నిందితుడు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook