Delhi: దేశ రాజధానిలో ఘోరం.. ఏడురోజులుగా యువతిపై అత్యాచారం.. ఉడకపెట్టిన పప్పును శరీరంపై వేసిన కేటుగాడు..
Woman Molested: డార్జిలింగ్ కు చెందిన యువతిపై అమానుష ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తనను పెళ్లి చేసుకొవాలని గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడి అమానుషంగా ప్రవర్తించాడు. యువతి సీక్రెట్ గా పోలీసులకు ఫోన్ చేసి కాపాడాలంటూ ఫోన్ కాల్ చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
Man Pour Hot Dal On: మహిళల భద్రతకు దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్లాలను తీసుకొస్తున్నాయి. అయిన కూడా ఇప్పటికే మహిళపై దాడులు మాత్రం ఆగడం లేదు. కొందరు కేటుగాళ్లు.. మహిళలను ప్రేమించాలని టార్చర్ చేస్తున్నారు. మరికొందరు పెళ్లి చేసుకొవాలని కూడా దాడి చేస్తున్నారు. కొంత మంది స్నేహంగా మాట్లాడిన కూడా ప్రేమిస్తున్నారని అనుకొని తీరా.. ప్రపోజల్ ను కాదనే సరికి ఎంతటి దాడులకైన దిగుతున్నారు. ప్రస్తుతం సంచలనంగా మారిన ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పరాస్ అనే వ్యక్తి ఢిల్లీలోని ఒక షాపులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో.. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌కు చెందిన యువతిని, పరాస్ అనే వ్యక్తి ఏడు రోజుల పాటు గదిలో బంధించి టార్చర్ చేశాడు. తనను పెళ్లి చేసుకొవాలని కూడా అమానుషంగా ప్రవర్తించాడు. ఏడురోజుల పాటు మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించి, అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతటితో ఆగకుండా వేడి వేడి పప్పును కూడా యువతి శరీరంపై పోసినట్లు సమాచారం.
దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలోని రాజు పార్క్‌లోని అద్దె వసతి గృహంలో మహిళ పరాస్‌తో కలిసి నెల రోజులుగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 2న అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 30న నెబ్ సరాయ్ పోలీస్ స్టేషన్‌కు పిసిఆర్ కాల్ రావడంతో ఓ మహిళను, కేటుగాడు కొట్టినట్లు సమాచారం అందింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం మహిళను రక్షించి ఎయిమ్స్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో చేరినప్పుడు మహిళ శరీరంపై దాదాపు 20 గాయాల గుర్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యువతి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగుందని ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు.
యువతి.. పరాస్ అనే వ్యక్తితో స్నేహం చేసి గత 3-4 నెలలుగా అతనితో టచ్‌లో ఉన్నట్లు పోలీసు అధికారి తెలిపారు.
సదరు యువతికి.. ఇంటి పనిమనిషి ఉద్యోగం రావడంతో జనవరి మొదటి వారంలో బెంగళూరు చేరుకోవాల్సి ఉందని అధికారి తెలిపారు. అయితే.. ఢిల్లీ మీదుగా రైలు వెళ్తున్నందున, ఆమె ఆగిపోవాలని నిర్ణయించుకుంది. పరాస్‌ను కలవాలని నిర్ణయించుకుంది. ఆమెను, బెంగళూరు వెళ్లవద్దని, ఇక్కడ ఉద్యోగం చూస్తానని కేటుగాడు చెప్పాడు. అతని హామీ మేరకు, ఆమె రాజు పార్క్‌లోని అద్దె నివాసంలో అతనితో పాటు బస చేసిందని అధికారి తెలిపారు.
అయితే, రోజులు గడిచేకొద్దీ, నిందితుడు ఆమెను కొట్టడం ప్రారంభించారని, వారం రోజుల పాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధిత మహిళ పోలీసులకు చెప్పింది. ఒక సందర్భంలో, పరాస్ "ఆమెపై వేడి పప్పు (పప్పు) పోశాడని ఆరోపించింది. దీని కారణంగా ఆమెకు కాలిన గాయాలయినట్లు సమాచారం.
మహిళ ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు జనవరి 30న భారతీయ శిక్షాస్మృతిలోని 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 376 (రేప్), 377 (సోడమీ) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఫిబ్రవరి 2న నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది.
Read More: Nisha Agarwal: క్యూట్ లుక్స్‌తో ఫిదా చేస్తోన్న నిషా అగర్వాల్.. పెళ్లైనా తగ్గని దూకుడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook