పౌరసత్వ సవరణ చట్టం నేపధ్యంలో చెలరేగిన ఢిల్లీ అల్లర్లలో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. ఛార్జిషీటులో ప్రముఖుల పేర్లు ఉండటం సంచలనం కల్గిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సీ ఏ ఏ..పౌరసత్వ సవరణ చట్టం దేశంలో అనేక ప్రాంతాల్లో నిరసనలకు కారణమైంది. ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. ఇప్పుడీ అలర్లకు సంబంధించి చోటుచేసుకున్న కీలకమైన పరిణామం సంచలనం రేపుతోంది. ఢిల్లీ అలర్లకు సంబంధించిన కేసులో అదనపు ఛార్జిషీటును అంటే సప్లిమెంటరీ ఛార్జిషీటును ఢిల్లీ పోలీసులు చేర్చారు. ఈ ఛార్జిషీటులో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, ఆర్ధికవేత్త జయంతి ఘోష్, ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అపూర్వానందా,  డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ రాహుల్ రాయ్ తదితరులు పేర్లున్నాయి. సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో ఇలా జరగడం ఆసక్తి రేపుతోంది. ఫిబ్రవరి 23-26 తేదీల్లో ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింస రేగింది. ఈ హింసలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. జాఫ్రాబాద్ ఘర్షణలో జేఎన్ యూ విద్యార్ధులైన కాలి, నటాషా నార్వాల్, జామియా మిల్లియా స్టూటెండ్ గుల్ ఫిషా పాతిమాల  వాంగ్మూలం ఆధారంగా వీరందర్నీ నిందితులుగా చేర్చారు ఢిల్లీ పోలీసులు. వీరితోపాటు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్, యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ కార్యకర్త ఉమర్ ఖలీద్,  మాజీ ఎమ్మెల్యే మతీన్ అహ్మద్, ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ వంటి  నాయకుల పేర్లను కూడా ప్రస్తావించినట్లు చార్జిషీట్లో పేర్కొన్నారు. Also read: Parliament session: వర్షాకాల సమావేశాలకు సోనియా, రాహుల్ లు దూరం