జామియా మిలీషియా ఘటనలో ఉన్నది వీరే..
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఐతే మరోవైపు పోలీసులు మాత్రం నిరసనలపై తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై కేసులు పెడుతున్నారు.
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఐతే మరోవైపు పోలీసులు మాత్రం నిరసనలపై తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై కేసులు పెడుతున్నారు. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేశారు. కొంత మంది ఆందోళనకారుల ఆస్తులను కూడా జప్తు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు కూడా ఆందోళనకారులను గుర్తించే పనిలో పడ్డారు.
తాజాగా ఢిల్లీ పోలీసులు .. ఢిల్లీలోని సీసీ కెమెరాలతోపాటు .. నిరసనల సందర్భంగా తీసిన వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీ జామియా మిలీషియా యూనివర్శిటీలో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించిన వీడియోలను పరిశీలించి.. అందులో నుంచి నిరసనకారులను గుర్తిస్తున్నారు. ఇప్పటికే ఓ జాబితా తయారు చేశారు. దాదాపు 70 మంది నిరసనకారుల ఫోటోలను తొలిదశలో విడుదల చేశారు.
డిసెంబర్ 15 నాడు జరిగిన ఘటనలో మరికొంత మంది ఆందోళనకారులు కూడా ఉండే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు గుర్తించి వారిపై పోలీసులు కేసులు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం వారి ఫోటోలను విడుదల చేసిన ఢిల్లీ పోలీసులు . . అల్లర్లు చేసిన వారిని ఎవరైనా గుర్తిస్తే 011-23013918, 9750871252 నంబర్లలలో ఢిల్లీ పోలీసులకు తెలియజేయాలని కోరుతున్నారు.