దేశంలో 'కరోనా వైరస్' వేగంగా విస్తరించేందుకు ప్రధాన కారణమైన తబ్లీగీ జమాత్‌పై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.  మొత్తంగా 20 అభియోగాలు నమోదు చేసేందుకు వ్యూహం సిద్ధం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే పలు సాక్ష్యాధారాలతో ఢిల్లీలోని సాకేత్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న వేళ.. ఢిల్లీ  నిజాముద్దీన్‌లోని మర్కజ్ భవనంలో తబ్లీగీ జమాత్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మత ప్రార్థనలు చేశారు. ఎక్కువ సంఖ్యలో మర్కజ్ భవనంలో గుమి గూడి ఉన్నారు. అంతే కాదు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు వెళ్లి మత ప్రచారం చేశారు. దీంతో దేశంలో కనీసం 30 శాతం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో మర్కజ్ భవనంలో గుమి గూడిన తబ్లీగీ జమాత్‌పై కేసులు పెట్టాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు. 


కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున బహిరంగ, మూకుమ్మడి సమావేశాలకు అనుమతి లేదని మార్చిలోనే ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐతే ప్రభుత్వం విధించిన నిబంధనలు బేఖాతర్ చేస్తూ.. తబ్లీగీ జమాత్ సభ్యులు.. మర్కజ్ భవనంలో గుంపుగుంపులుగా సమావేశం ఏర్పాటు చేశారు. ఐతే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని ఇప్పుడు ఢిల్లీ పోలీసులు వారిపై కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 


మర్కజ్ మత ప్రార్థనలకు హాజరైన 83 మంది విదేశీ ప్రతినిధులపై కేసులు పెట్టాలని ఢిల్లీ పోలీసులు ఛార్జిషీట్ తయారు చేశారు. అందులో సౌదీ అరేబియాకు చెందిన 10 మందితోపాటు బ్రెజిల్ కు చెందిన 8 మంది పేర్లు కూడా ఉన్నాయి. తబ్లీగీ జమాత్ ప్రతినిధులపై కేసులు పెట్టేందుకు పలు ఆధారాలను కూడా ఢిల్లీ పోలీసులు సేకరించారు. తబ్లీగీ జమాత్ చీఫ్ మౌలానా షాద్ ఐదుగురు అనుచరుల పాస్ పోర్టులు సీజ్ చేశారు. పలువురు విదేశీ ప్రతినిధులను ఢిల్లీ పోలీసులు విచారణ చేశారు. మౌలానా షాద్ ఆదేశాల ప్రకారం మార్చి 20 తర్వాత కూడా తాము అక్కడే ఉండాల్సి ఉందనే భయంకరమైన నిజం వెల్లడించారు. 


[[{"fid":"186076","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అంతే కాదు వారికి ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయనే దానిపైనా ఢిల్లీ పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇందుకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను గుర్తించారు. ఎక్కువ గల్ఫ్ దేశాల నుంచి నిధులు వస్తున్నాయనే విషయం పోలీసుల విచారణలో బయట పడింది. ఇప్పటికే తబ్లీగీ జమాత్ చీఫ్ మౌలానా షాద్ ఇద్దరు కుమారులను పోలీసులు అరెస్టు చేయడంతో పలు కీలక ఆధారాలు లభించాయి.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..