Congress MP Jyotimani: నా పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.. మహిళా ఎంపీ ఆరోపణలు..!
Congress MP Jyotimani: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఈడీ విచారణ రాజకీయ దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా దీనిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు.
Congress MP Jyotimani: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఈడీ విచారణ రాజకీయ దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా దీనిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ఛలో రాజ్‌భవన్ హింసాత్మకంగా మారింది. ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయి. కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.
ఇటు దేశ రాజధాని సైతం అట్టుడుకింది. ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆ పార్టీ నేతలు, కార్యక్తలు ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నేతలపై పోలీసులు దాడులు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ మహిళా ఎంపీ జ్యోతి మణి ..పోలీసులపై మండిపడ్డారు. తనపై పోలీసులు దాడి చేశారని..తన దుస్తులను చించి వేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ట్విట్టర్ పోస్ట్ చేశారు.
ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని వీడియో ఎంపీ జ్యోతి మణి ఆరోపించారు. తనపై దాడి చేయడమే కాకుండా నేరం చేసిన వారిలా బస్సుల్లో తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మంచి నీళ్లు అడిగినా ఇవ్వలేదన్నారు.
మహిళా ఎంపీ పట్ల పోలీసులు ప్రవర్తించడం ఇదేనా ప్రశ్నించారు. దీనిపై లోక్‌సభ స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియోను కాంగ్రెస్ సీనియర్ శశిథరూర్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈసందర్భంగా కేంద్రం తీరుపై ఆయన ఫైర్ అయ్యారు. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఇంతకంటే దారుణం ఉంటుందా అని అన్నారు. మహిళలపై ఇలా ప్రవర్తిస్తే ఎలా అని ప్రశ్నించారు. దీనిపై లోక్‌సభ స్పీకర్ జోక్యం చేసుకోవాలన్నారు.
Also read: Post Office Scheme: పోస్టాఫీసు సూపర్ హిట్ స్కీమ్, 50 వేలు జమ చేస్తే చాలు..ప్రతినెల 33 వందలు
Also read: Renuka Chowdhury: పోలీసులపై రేణుకా చౌదరి చిందులు..ఎస్సై చొక్కా పట్టుకున్న నేత..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook